Maharashtra CM: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయానికి మహాయుతిలోని శివసేన, ఎన్సీపీలు అంగీకరించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉండబోతున్నారు. తాజాగా అమిత్ షాతో సమావేశమైన ముగ్గురు ఈ ప్రతిపాదనకు అంగీకరించారని తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాయుతి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 288 సీట్లలో 233 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీపీ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కేవలం 50 లోపు స్థానాలకే పరిమితమైంది.
Read Also: US: బోర్డింగ్ పాస్ లేకుండానే న్యూయార్క్ నుంచి పారిస్‌కు జర్నీ.. చివరికిలా..!
ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ కొన్ని రోజులుగా సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు అమిత్ షాతో ఇరువురు ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. దేవేంద్ర ఫడ్నవీస్‌కి సీఎం పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. ఆయన వద్దే హోం మంత్రిత్వ శాఖ ఉంటుందని సోర్సెస్ చెబుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉండబోతున్నారు. ఏక్‌నాథ్ షిండేకి అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ, అజిత్ పవార్‌కి ఆర్థిక శాఖ దక్కుతుందని సమాచారం..