Maharashtra Next CM: బ్రాహ్మణ సీఎం కింద ఇద్దరు మరాఠా డిప్యూటీ సీఎంలు.. మహారాష్ట్ర అంగీకరిస్తుందా?
- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 6 రోజులు
- సీఎం నిర్ణయంపై తూతూ మంత్రంగా సమావేశాలు
- షిండేను ఒప్పించేందుకు పలు ప్రతిపాదనలు
- ఏకీభవించని షిండే
- నేడు కూటమి సమావేశం వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 6 రోజులు గడుస్తున్నా.. సీఎం నిర్ణయం తూతూమంత్రంగా సాగుతోంది. షిండేను ఒప్పించేందుకు బీజేపీ పలు ప్రతిపాదనలు చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండే మాత్రం అంగీకరించలేదు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం ముంబైలో జరగాల్సిన కూటమి సమావేశం కూడా వాయిదా పడింది. సమావేశానికి ముందు షిండే తన సొంత గ్రామానికి వెళ్లారు.
సీఎం పదవి కంకణం కట్టుకున్న షిండే..
తాజా నివేదికల ప్రకారం.. గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అని స్పష్టం చేసినట్లు సమచారం. డిప్యూటీ సీఎం పదవిపై బీజేపీ షిండేతో ఒకసారి చర్చించింది. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టడం వల్ల మహాయుతి ఐక్యత సందేశం పంపుతుందని బీజేపీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఫడ్నవీస్‌తో పాటు ఇతర అనుభవజ్ఞులైన నాయకుల గురించి ఆలోచించింది. పార్టీల్లో సీనియర్ పదవులను కలిగి ఉన్నప్పటికీ.. ఇతర బాధ్యతలను కూడా అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే.. షిండే మాత్రం ఇందులో వేటినీ ఏకీభవించలేదు. తనకు సీఎం పదవి కావాలని కంకణం కట్టుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
డిప్యూటీ సీఎం పదవిని షిండే ఎప్పటికీ అంగీకరించరు..
ఇదిలా ఉండగా.. తాజాగా శివసేన నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ కులపరంగా బ్రాహ్మణుడని శివసేన అంటోంది. ఇద్దరు మరాఠా నాయకులైన అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలను బ్రాహ్మణుడి క్రింద డిప్యూటీలుగా ఉంచడాన్ని మరాఠా ప్రజానికం ఒప్పుకోదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. మరాఠా ఓటర్లు దీన్ని ఇష్టపడరని.. ఇప్పటికే రాష్ట్రంలో పలు కారణాల వల్ల బీజేపీపై మరాఠా ప్రజానికం కోపంగా ఉందని పేర్కొంది. మహాయుతి కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం ఉందని పలువురు నేతులు కుండ బద్దలు గొడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవిని షిండే ఎప్పటికీ అంగీకరించరని శివసేన నేత సంజయ్ శిర్సత్ స్పష్టం చేశారు.
షిండేను వదులుకునేందుకు సిద్ధంగా లేని బీజేపీ..
కాగా.. అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ షిండేను కోల్పోవడానికి కమల దళం అనుకూలంగా లేదు. ఏక్‌నాథ్ షిండే బీజేపీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. ఎట్టిపరిస్థితుల్లోనూ షిండే ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా చూడాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏక్నాథ్ షిండే కూడా సీఎం పదవిని వదులుకునేందుకు భారీ బేరసారాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో షిండేకు పెద్ద మంత్రిత్వ శాఖను ఆఫర్ చేశారు. కానీ ఆయన దానిని కూడా తిరస్కరించారు. ఏక్నాథ్ షిండే ఎట్టిపరిస్థితుల్లోనూ మహారాష్ట్రను విడిచిపెట్టే పరిస్థితి లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా.. హోం మంత్రిత్వ శాఖ విషయంలో కూడా ఆయన మొండిగా ఉన్నారు. ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయితే.. శివసేన మరో నాయకుడిని డిప్యూటీ సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. షిండే పదవిపై మాత్రం ఎలాంటి స్పష్టత రావడం లేదు.
మహారాష్ట్రలో మరాఠాల ప్రభావం అధికం..
రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. మరాఠా ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. గత లోక్‌సభ ఎన్ని్కల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరాంగే పాటిల్ ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో మహాయుతి కూటమికి చాలా నష్టం వాటిల్లింది. ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై కూడా అసహనం వ్యక్తమైంది. ఇప్పుడు మరాఠా ముఖ్యమంత్రి ఎక్‌నాథ్ షిండేను తప్పించి.. బ్రాహ్మణ కులానికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎంను చేస్తే మాత్రం మహాయుతికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరి కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్ని్కలు జరగనున్నాయి. ఈ ఎన్ని్కల్లో మరాఠాలు మహాయుతి కూటమికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!