Jairam Ramesh: మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్ని జిల్లాల అధికారులను పిలిచి బెదిరించారని ఆరోపించారు.
సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు అడ్డదారిలో పట్టు నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఈసీ, ఎన్డీయే కూటమి ఏ విధంగా అన్యాయంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలుసు అన్నారు. ప్రజా తీర్పు వైసీపీకి అనుకుంలాగా ఉంది.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారు జాగ్రత్తగా చూడాలి అని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ ఏజెంట్లకు అధికారులు శిక్షణ ఇస్తున్నారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏజెంట్లకు వైసీపీ, టీడీపీ పార్టీల అధినేతలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
గత 35 ఏళ్ల తర్వాత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది. ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 58.46 శాతం ఓటింగ్ నమోదైందని పోల్ ప్యానెల్ పేర్కొంది. 2019తో పోల్చితే కశ్మీర్ లోయలో 30 శాతం భారీగా పెరిగిందని తెలిపింది. ఈ నిర్ణయం త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సానుకూలంగా ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్…
దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఓటర్ డేటా 48 గంటల్లో విడుదల చేయాలంటూ పలువురు రాజకీయ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో.. అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. "పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు.