Jammu Kashmir Elections: 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..
- 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు..
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలి ఎన్నికలు..
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..
- మూడు విడతల్లో పోలింగ్.. అక్టోబర్ 04న ఫలితాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Elections: హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడుతల్లో అంటే సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మిగతా రాష్ట్రాలతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కూడా అక్టోబర్ 04న విడుదల కానున్నాయి.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ఆర్టికల్ 370 రద్దు తర్వాత, అవిభక్త జమ్మూ కాశ్మీర్‌ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 87.07 లక్షల మంది తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 11 వేల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. 3.71 లక్షల మంది యువత తొలిసారిగా ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.
2014 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. 2018 నుంచి గవర్నర్ పాలనలో ఉంది. సెప్టెంబర్ 30 నాటికి జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం తిరిగి రావాలనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన మరుసటి రోజు ఆగస్టు 20 నాటికి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని ఈసీ తెలిపింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, వారి కొత్త భవిష్యత్తుని కోరుకుంటున్నారని ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ అన్నారు. “ఎన్నికల సన్నాహాలను పరిశీలించడానికి మేము ఇటీవల J&K ను సందర్శించాము. గొప్ప ఉత్సాహం కనిపించింది… ప్రజలు ఈ ప్రక్రియలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ప్రజలు వీలైనంత త్వరగా ఎన్నికలు కోరుకుంటున్నారు…” అని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఓటర్లలో చైతన్యం కనిపించిందని చెప్పారు.

తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?