Telangana Lok Sabha Election 2024: ఆదిలాబాద్‌లో ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Lok Sabha Elections 2024 Results: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడు చోట్ల ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, బోద్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రం టీటీడీసీలో ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో.. కుమురంభీం జిల్లా పరిధిలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో కొనసాగనుంది.
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
మొత్తం 156 రౌoడ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో టేబుల్‌పై 14 ఈవీఎంలను అధికారులు లెక్కించనున్నారు. మొత్తం ఓట్లు 16,50,175 ఉండగా.. 12,21,583 ఓట్లు పోలయ్యాయి. అంటే 74.03 పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం ఏడు కౌంటింగ్ హాల్స్ ఉండగా.. ప్రతి కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక్కో రౌండుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. గంటకు నాలుగు రౌండ్లు పూర్తవుతాయి.
నియోజకవర్గం, పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు ఓట్లు, రౌండ్లు:
సిర్పూర్ – 320 – 1,63,944 – 23
ఆసిఫాబాద్ – 356 – 1,71,511 – 23
బోథ్ – 306 – 1,65,157 – 22
ఆదిలాబాద్ – 292 – 1,81,136 – 21
ఖానాపూర్ – 309 – 1,62,101 – 22
ముథోల్ – 306 – 1,85,168 – 22
నిర్మల్ – 311 – 1,92,546 – 22
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..