ఎలక్షన్ కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై భారత ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. అయితే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ఎన్నికల ప్రక్రియను కొనియాడుతూనే ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం వైట్ హౌజ్ కి చెందిన ఓ నాయకుడు ఇండియా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తించేసిందని.. ఈసీకి అభినందనలు తెలిపారు. తాజాగా భారత్ ఎన్నికల ప్రక్రియపై పాక్ పార్లమెంట్లో చర్చ జరిగింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత షిబ్లీ ఫరాజ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎన్నికల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తారు. భారత్ ఎలాంటి రిగ్గింగ్ లేకుండాఎన్నికలను నిర్వహించిందని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ.. మోసం ఆరోపణలు లేకుండా భారత్ తన భారీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందని ఫరాజ్ అన్నారు.
READ MORE: Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్..
ప్రతిపక్ష నేత షిబ్లీ ఫరాజ్ మాట్లాడుతూ.. ‘మన శత్రు దేశాన్ని నేను ఉదాహరణగా చెప్పదలచుకోలేదు. అక్కడ తాజాగా జరిగిన ఎన్నికల్లో 80 కోట్ల మంది ఓటు వేశారు. వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల రోజులకు పైగా ఎన్నికలు నిర్వహించారు. ఓటర్లు ఈవీఎంల ద్వారానే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఒక్కరైనా ప్రశ్నించారా? మాకు కూడా అదే కావాలి. ఈ ఎన్నికలలో గెలిచామా లేదా అనేది సమస్య కాదు. ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచారో.. ఎవరు ఓడారో నమ్మలేం. ఈ దేశం చిక్కుకోవడం మాకు ఇష్టం లేదు. ఇది మన రాజకీయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. మనం కూడా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎందుకు నిర్వహించలేకపోతున్నాం?’ అని ఆయన ప్రశ్నించారు.