ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈసీ లెక్కల ప్రకారం 78.36 శాతం మేర పోలింగ్ అయినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా ఓటింగ్ శాతం నమోదు అవుతోంది.. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. క్రమంగా పుంజుకుంది.. ఇక, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది..
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ.. పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందన్నారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్ కామ్ పెట్టామని…
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా కచ్చితమైన పోలింగ్ శాతం వివరాలను తెలిపేలా ఆదేశించాలని కోరుతూ.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈసీ కారణాలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బటన్ నొక్కిన తర్వాత ఖాతాల్లో జమచేయలేదని ఈసీ ఆర్డర్ లో పేర్కొంది. స్కీంలు ప్రారంభించి నగదు బదిలీ చాలావరకు జరిగిన వాటిని కూడా అడ్డుకున్నారనీ అంటున్న వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలో వివరాలు కూడా వెల్లడించింది అధికార వైసీపీ. జనవరి 29న మొదలైన ఆసరా చివది దఫా నగదు బదిలీ అయినట్లు తెలిపింది. రూ. 6,394 కోట్లకు గానూ, రూ. 4, 555 కోట్ల బదిలీ అయిందని..…
ఇవాళ (బుధవారం) ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ రూపొందించారు.
బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచి పోయిందని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులను గుర్తించటానికి 2023లోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ వేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. 108 కరువు మండలాల్లో 6.95 లక్షల రైతులను గుర్తించి గత ఏడాది…
పీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు మే 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.