ఆరు వారాల పాటు కొనసాగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. శనివారం ముగిసింది. కాగా.. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. మూడోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే రేపు (మంగళవారం) నేతల భవితవ్యం బయటపడనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
BSF Recruitment 2024: అలర్ట్.. భారత సైన్యంలో పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఎన్నికల ప్రవర్తన నియమాలు 1961లోని రూల్ 54 A ప్రకారం.. మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో అభ్యర్థులు లేదా పోటీలో ఉన్న ప్రతి పార్టీ ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తాళం తెరుస్తారు. ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి మరియు ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు కూడా ఉంటారు. అంతేకాకుండా.. ఈ ప్రక్రియ మొత్తం వీడియోగ్రాఫ్ చేస్తారు. ఆ తర్వాత ఈవీఎం యొక్క కంట్రోల్ యూనిట్ కౌంటింగ్ టేబుల్‌కి తీసుకువస్తారు. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో మొత్తం 15 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. అందులో 14 టేబుల్స్ కౌంటింగ్ కోసం, ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపు రోజు ఏ టేబుల్‌పై ఏ ఉద్యోగి కౌంటింగ్ చేస్తారో గోప్యంగా ఉంచారు. ఆ రోజు ఉదయం ప్రతి జిల్లా రిటర్నింగ్ అధికారి యాదృచ్ఛికంగా ఉద్యోగులకు హాళ్లు, టేబుల్స్ కేటాయిస్తారు.
Hema Arrest: హేమ అరెస్ట్.. బురఖాలో హాస్పిటల్ కు?
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్, ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఇది జరిగిన వెంటనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక గంట తర్వాత, ట్రెండ్‌లు రావడం ప్రారంభమవుతాయి. కౌంటింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది, ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఏ అభ్యర్థి ఏజెంట్‌ను బయటకు వెళ్లనివ్వరు. డ్యూటీలో ఉన్నవారు తప్ప ఎవరూ మొబైల్‌ని లోపలికి తీసుకెళ్లలేరు. మరోవైపు.. ఫలితం యొక్క అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత, ఏజెంట్ అక్రమాలు చేస్తున్నట్లుగా అనిపిస్తే.. అభ్యర్థి రీకౌంటింగ్ కు డిమాండ్ చేయవచ్చు. కాగా.. రిటర్నింగ్ అధికారి ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలను రిజల్ట్ షీట్‌లో నమోదు చేసి.. అనంతరం ఫలితాన్ని ప్రకటిస్తారు. గెలిచిన అభ్యర్థికి విజయ ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. కాగా.. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మళ్లీ ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచుతారు. నిబంధనల ప్రకారం కౌంటింగ్ తర్వాత 45 రోజుల పాటు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచాలి.