ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి అనే దానిపై రాజకీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాలని సీఈసీ తెలియజేసింది. కరోనా కారణంగా ఎన్నికల సమయాన్ని గంట పెంచుతున్నట్టు తెలియజేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్…