చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. "పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పల్నాడులో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వైసీపీ నాయకులే గొడవలు చేశారు.. టీడీపీ నాయకులు చాలా మంచి వాళ్ళు అనే విధంగా పరిస్థితులను మార్చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ చీఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నేడు ప్రాథమిక నివేదికను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ఇవ్వనున్నారు.
ఏపీలో జరిగిన అల్లర్లపై పూర్తి నివేదికను కోరింది. దీంతో ఏర్పాటైన సిట్ గత రెండు రోజులుగా విచారణ చేసి.. పూర్తి స్థాయిలో ప్రాథమిక రిపోర్ట్ ను రెడీ చేశారు. నిన్నటితో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో ఎంక్వైరీ చేసిన అధికారులు నేడు డీజీపీకి నివేదికను ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ సీఎస్ ద్వారా సీఈఓ, సీఈసీకి అందించనున్నారు.
ప్రజలు శాంతియుతంగా ఉండాలని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి సూచించారు. చట్టాన్ని చేతిలో తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ మేరకే ఏపీ సీఈవోకు లేఖ రాసిన ఆయన.. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్‌తో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…