Israel-Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయడం స్టార్ట్ చేసింది. శనివారం నాడు అర్థ రాత్రి దాదాపు రెండు వందలకు పైగా డ్రోన్స్, మిస్సైల్స్‌ను ఇరాన్ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఇక, ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉంది.
Read Also: Memantha Siddham: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం
అయితే, శనివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. ఇక, ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి రాగానే సైరన్ శబ్ధంతో అట్టుడుకుపోతుంది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చి వేసినట్లు తెలుస్తుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాన్ని క్లోజ్ చేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను అలర్ట్ చేశాయి. ఇరాన్‌లో డ్రోన్ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. అలాగే, ఇజ్రాయెల్ కు సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను ఆమెరికా మోహరించింది.
https://twitter.com/IDF/status/1779305416263962648