తాజాగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు. ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో డ్రోన్ లతో పెట్రోలింగ్ మొదలు పెట్టారు అధికారులు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆపరేషన్ మొదలుపెట్టి దశల వారీగా కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామని సిపి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెద్దపల్లిలో జరిగే అసాంఘిక శక్తుల నిర్మూలనకు, అలాగే ప్రజల పద్ధతులు కొరకు ఈ సేవలు మొదలు పెట్టామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తాము విధి నిర్వహణలో కొన్ని సమయాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కాస్త ఇబ్బందిగా ఉండటంతో తమ ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయాలనే ఉద్దేశ్యంతో “ఆపరేషన్ గరుడ” కార్యక్రమం మొదలు పెట్టమని ఆయన తెలిపారు.
Also read: Anjali : నాకు నాలుగు పెళ్లిళ్లు చేశారు.. అంజలి అంత మాట అనేసిందేంటి?
ఇందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ లోని ప్రాంతాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిస్థాయిగా డ్రోన్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఎవరైనా గొడవలకు పాల్పడిన చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్న వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోల ఆధారంతో వారి కేసులు అమలు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతామని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఈ డ్రోన్ లకు కావలసిన ఆర్థిక సహాయం అందించడానికి జిల్లాలోని లీడ్ బ్యాంక్ మేనేజర్ చెగొండ వెంకటేష్ ఆర్థిక సాయం అందించారని అధికారులు తెలిపారు.
Also read: Ganja: గంజాయి మత్తులో ఊగిపోతున్న యువత.. పోలీసుల అదుపులో యువకులు..
ఇందులో భాగంగా లీడ్ బ్యాంకు మేనేజర్ ను పట్టణ పోలీసులతో సహా ప్రముఖులు కూడా అభినందించారు. ఇక ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిబి రాఘవేంద్రరావు, ఎడిషన్ డిసిపి అడ్మిన్ రాజు, సిఐ కృష్ణ, పెద్దపల్లి ఏసిపి కృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ లు పాల్గొన్నారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా నిందితులను త్వరగా గుర్తించి వారిపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.