Indian Air Force : అమెరికా నుంచి ‘హంటర్ కిల్లర్’ని కొనుగోలు చేస్తోన్న భారత్.. శత్రుదేశాలకు హడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force : చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుండి 31 రిమోట్‌తో నడిచే సాయుధ MQ-9B ‘హంటర్-కిల్లర్’ విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలు జరుపుతోంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి ఈ మెగా డీల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం.. నేవీ గరిష్టంగా 15 డ్రోన్‌లను పొందబోతోంది. దీని తరువాత ఆర్మీ 8, ఎయిర్ ఫోర్స్ 8 రాబోతున్నాయి.
Read Also:Gemini AI: కొత్త అవతార్‌లో గూగుల్ జెమిని ఏఐ.. మరిన్ని ఫీచర్లతో..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
చైనా తన సాయుధ కై హాంగ్-4 .. వింగ్ లూంగ్-II డ్రోన్‌ల సరఫరాను పాకిస్తాన్‌కు పెంచింది. దీంతో భారత్ కూడా అప్రమత్తమై తన బలాన్ని పెంచుకోనుంది. “పాకిస్తాన్ చైనా నుండి మరో 16 సాయుధ సిహెచ్ -4 డ్రోన్‌లను కోరింది. ఇప్పటికే సైన్యంలో ఏడు సిహెచ్ -4 డ్రోన్‌లు, నావికాదళంలో మూడు ఉన్నాయి” అని సమాచారం.
Read Also:Actress Regina Cassandra: మంత్రి సీతక్కను కలిసిన హీరోయిన్ రెజీనా.. ఎందుకంటే?
MQ-9B రీపర్ లేదా ప్రిడేటర్-B డ్రోన్ 40,000 అడుగుల ఎత్తులో దాదాపు 40 గంటల పాటు ప్రయాణించేలా రూపొందించబడింది. వీటిలో హెల్‌ఫైర్ ఎయిర్-టు గ్రౌండ్ క్షిపణులు, ఖచ్చితమైన దాడుల కోసం స్మార్ట్ బాంబులు అమర్చబడతాయి. ఇవి చైనీస్ సాయుధ డ్రోన్‌ల కంటే మెరుగైనవిగా పరిగణించబడుతున్నాయి. 31 సాయుధ MQ-9B డ్రోన్‌లు, సంబంధిత పరికరాల కోసం అమెరికా 33,500 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. భారతదేశం తన ఖర్చును తగ్గించుకునే దిశగా మాట్లాడుతోంది. పరికరాలలో 170 హెల్‌ఫైర్ క్షిపణులు, 310 GBU-39B ప్రెసిషన్-గైడెడ్ గ్లైడ్ బాంబులు, నావిగేషన్ సిస్టమ్‌లు, సెన్సార్ సూట్‌లు, మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. క్యాబినెట్ కమిటీ నుండి తుది ఆమోదం పొందిన తర్వాత ఈ సంవత్సరంలోనే డీల్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు, ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని సంవత్సరాలలో మొదటి 10 MQ-9B డ్రోన్‌లను ప్రవేశపెట్టాలని సాయుధ దళాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..