US- Taiwan: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ముప్పుతిప్పలు పెట్టిన సాయుధ డ్రోన్లు తాజాగా తైవాన్ చేతికి అందించేందుకు అమెరికా సిద్ధమవుతుంది. తైవాన్‌కు భారీ సంఖ్యలో వీటిని విక్రయించేందుకు యూఎస్ నిర్ణయించింది. 36 కోట్ల డాలర్ల ఒప్పందానికి ఆమోదం కుదిరింది. ఉక్రెయిన్‌లో విజయవంతంగా ప్రయోగించిన కొన్ని డ్రోన్లు దీంట్లో భాగంగా తైవాన్‌కు చేరబోతున్నాయి. దాదాపు 1,000 పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం కింద అగ్రరాజ్యం అమెరికా 720 స్విచ్‌బ్లేడ్ డ్రోన్లు, అగ్నిమాపక వ్యవస్థలను తైవాన్‌కి అందించబోతుంది.
Read Also: CM Chandrababu: రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!
వీటితో పాటు 291 ఆల్టియస్ 600ఎం ఆయుధ వ్యవస్థలను కూడా తైవాన్ కు అమెరికా సరఫరా చేయనుంది. తైవాన్‌పై సైనిక ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో వీటిని విక్రయించాలని జో బైడెన్ సర్కార్ నిర్ణయించింది. ఈ ఒప్పందాన్ని డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయుధాల విక్రయానికి సమ్మతించిన అమెరికాకు తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె కృతజ్ఞతలు చెప్పారు. స్విచ్‌బ్లేడ్ 300, 600లను ఆత్మాహుతి డ్రోన్లుగా పేర్కొన్నారు. వీటిని సైనికుడు బ్యాక్‌ప్యాక్‌లో పెట్టుకొని కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది. శత్రువుకు దూరంగా ఉంటూ కొండలు, సముద్రాలు, గగనతలాల నుంచి వీటిని ప్రయోగించే ఛాన్స్ ఉంది. ప్రయోగించిన తర్వాతే వాటి రెక్కలు విచ్చుకొని డ్రోన్‌లా ఎగురనున్నాయి. అందుకే స్విచ్ బ్లేడ్ అని వీటికి పేరు పెట్టారు. అయితే, ఇది ఒక సైనిక వాహనాన్ని 10 కిలో మీటర్ల దూరం నుంచి ఈజీగా ధ్వంసం చేస్తుంది. దీని ఆపరేటర్‌కు రియల్ టైమ్ వీడియో లింక్‌ను కూడా అందించనుంది.. ఇక, యుద్ధ క్షేత్రంపై పూర్తి అవగాహనను సైనికులకు కల్పిస్తుంది. ఆయుధ సరఫరా వల్ల ప్రాంతీయంగా సైనిక సమతౌల్యంపై ఎలాంటి ప్రభావం పడబోదని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.