ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒక విధ్వంసకర చర్య అని మస్క్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో అమెరికాలోని పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోపించారు. మరో పోస్టులో ఈ బిల్లు రిపబ్లికన్ల యొక్క రాజకీయ ఆత్మహత్యగా పేర్కొంటూ నిర్వహించిన పోల్‌ను ప్రస్తావించారు. ఇది రుణ పరిమితిని 5 ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ విజయం లభించింది. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ట్రంప్ అధికారాలను కట్టడి చేయడాన్ని సుప్రీంకోర్టు పరిమితం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నంపై 6-3తో తీర్పు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులు దేశవ్యాప్తంగా జారీ చేసిన నిషేధాలు చట్ట సభలు కోర్టులకు ఇచ్చిన అధికారాలను మించిపోయేలా ఉందని కోర్టు పేర్కొంది.
ట్రంప్ వ్యాఖ్యలను తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశం అయ్యే ఆలోచన మాకు లేదని వెల్లడించారు.
Zohran Mamdani: 33 ఏళ్ల డెమోక్రటిక్ లీడర్ జోహ్రాన్ మమ్దానీ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి, న్యూయార్క్ మేయర్ పీఠానికి అతి చేరువులోకి వెళ్లారు. అయితే, ఈ విజయం పట్ల ముఖ్యంగా అధికారంలో ఉన్న రిపబ్లిక్ పార్టీతో పాటు, ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్(MAGA)’’ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Donald Trump: భారత్- పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపానని ఇప్పటికే అనేక సార్లు ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరోసారి ఇవే కామెంట్స్ చేశారు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి మమ్దానీపై పరుష పదజాలంతో విరుచుకు పడ్డారు. మమ్దానీ భయంకరమైన వ్యక్తి.. అతని గొంతు గరుకుగా ఉంటుంది.. అతడు అసలు తెలివైనవాడే కాదని మండిపడ్డారు.
Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్, ఇరాన్‌లు ‘‘పాఠశాలల్లోని ఇద్దరు పిల్లలు’’ అని అభివర్ణించారు. ఇటీవల, కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరు దేశాలు మిస్సైల్ దాడులు జరుపుకోవడంపై డొనాల్డ్ ట్రంప్ లైవ్ టీవీలో ‘‘ఎఫ్-వర్డ్’’ వాడటం ఆన్లైన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత రెండు దేశాలు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉందని.. సైనికులను వెనక్కి రప్పించాలంటూ ఇజ్రాయెల్ ను ఆదేశించారు. దీంతో దాడులు చేసినట్టు ఒప్పుకున్న ఇజ్రాయెల్.. తమ అధినేత నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడిన తర్వాత దాడులు ఆపేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. Read Also : Rammohan…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Iran-israel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ – ప్రత్యర్థి దేశమైన ఇరాన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ (Complete and Total Ceasefire) కి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ విరమణను వచ్చే 24 గంటల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు. “ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకి అంగీకారమైంది. దాదాపు ఆరు గంటల లోపు ఇరువురు తమ…