జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు, ట్రంప్‌తో కొనసాగుతున్న వివాదం, కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో, మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయ్యింది. దీని కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని…
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున భీకరదాడులు చేసింది. రెబల్స్ ఆధీనంలో ఉన్న ఓడరేవులు, వారి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. పుతిన్‌తో తాను చాలా అసంతృప్తితో ఉన్నారనని, ఆయన ప్రజలను చంపాలనుకుంటూనే ఉన్నారని ట్రంప్ అన్నారు. ఇది చాలా కఠినమైన పరిస్థితి అని, పుతిన్ ఫోన్ కాల్ పట్ల నేను చాలా అసంతృప్తితో ఉన్నానని, ఆయన ప్రజల్ని చంపుతూనే వెళ్లాలని అనుకుంటున్నారని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధం మరో వివాదాస్పద మలుపు తిరిగింది. బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై సంతకం చేశారు. Also Read:Off The…
వైట్ హౌస్ లో జరిగిన పిక్నిక్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను ఉపశమనం, ప్రభుత్వ ఖర్చు తగ్గింపుకు సంబంధించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లుపై సంతకం చేశారు. దీనితో, ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు చట్టంగా మారింది. ట్రంప్ పరిపాలన ఆర్థిక విధానంలో ఈ చారిత్రాత్మక బిల్లు కీలక విజయంగా పరిగణిస్తున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న ప్రతినిధుల సభ ఒక రోజు ముందుగా 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ చట్టం…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. అధికారంలోకి రాగానే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నారు. కానీ పెరుగుతున్న అప్పును నియంత్రించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఘన విజయం. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను గురువారం రాత్రి ప్రతినిధుల సభ 218-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. సెనేట్, ప్రతినిధుల సభ నుంచి ఆమోదం పొందిన తర్వాత, ఈ బిల్లును ఇప్పుడు అధ్యక్షుడి సంతకం కోసం పంపారు. బిల్లుపై ఓటింగ్ సమయంలో, ఇద్దరు రిపబ్లికన్ ఎంపీలు పార్టీ లైన్ నుంచి తప్పుకుని డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. రెండు సభల నుంచి ఈ బిల్లు ఆమోదం పొందడం…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్.. మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మమ్దానీ రియాక్ట్ అయ్యారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత ముస్లిం సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు.
Jai Shankar: జమ్మూ కాశ్మీర్లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
అమెరికా-భారతదేశం మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ కీలక ప్రకటన చేశారు.