USA: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. భారత్‌తో వాణిజ్యం, రష్యన్ ఆయిల్ దిగుమతులు ఆపివేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలతో ఇరు దేశాల ఉద్రిక్తతల మధ్య లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా, తైవాన్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంటుందని ఆయన అన్నారు. అలాగే స్విట్జర్లాండ్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: Charlie Kirk: చార్లీ కిర్క్‌కు ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’.. హత్య తర్వాత ట్రంప్ ప్రకటన..
ఇటీవల, ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. రాబోయే రోజుల్లో తన స్నేహితుడు నరేంద్రమోడీతో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నా అని, వాణిజ్య అడ్డంకులు పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయని, రెండు దేశాలకు విజయవంతమైన ముగింపు కోసం విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి మోడీ స్పందిస్తూ.. ‘‘భారతదేశం మరియు అమెరికా సన్నిహిత మిత్రులు, సహజ భాగస్వాములు. మా వాణిజ్య చర్చలు భారతదేశం-అమెరికా భాగస్వామ్యం సామర్థ్యాన్ని తెలియజేస్తాని నేను విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.
రెండు దేశాల మధ్య సయోధ్య కుదురుతున్న దశలో లుట్నిక్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. గతంలో కూడా లుట్నిక్ భారత్‌ను ఉద్దేశిస్తూ కఠినంగా మాట్లాడారు. ‘‘భారత్ త్వరలో క్షమించండి అని అడుతుందని, చర్చలకు తిరిగి వస్తుంది’’ అని కామెంట్స్ చేశారు. తాజాగా, మరోసారి రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్‌ని భయపెట్టేలా వ్యాఖ్యలు చేశారు.