పాకిస్తాన్‌లోని సహజ వనరులపై జరుగుతున్న వాదనలను బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాంతంలో ఉన్న విస్తారమైన చమురు, ఖనిజ నిల్వలు వాస్తవానికి పాకిస్తాన్‌కు కాదని, ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’కు చెందినవని ఆయన తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రభుత్వాన్ని పాకిస్తాన్ సైన్యం, ముఖ్యంగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ‘పూర్తిగా తప్పుదారి పట్టించారని’ మీర్ యార్ బలూచ్ వెల్లడించాడు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశంగా ఆయన అభివర్ణించారు. Also…
Russia vs America: రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్ కు ప్రతిస్పందనగా.. ఆ దేశానికి చేరువలో సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అగ్రరాజ్యం మోహరించింది. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ మాట్లాడుతూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
Shashi Tharoor: భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’’గా అభివర్ణించాడు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమర్థించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు విభేదిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్…
India: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
డొనాల్డ్ ట్రంప్ పోస్ట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసిన హర్ష్ గొయెంకా, భారత్‌కు పాకిస్థాన్ చమురును విక్రయిస్తారని చెప్పడమంటే టీ20 మ్యాచ్‌లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని చెప్పడమేనని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలను పక్కనబెడితే, వాస్తవ రూపంలో కూడా అది అసాధ్యమే అని ఆయన అన్నారు.
India vs Trump Tariffs: భారత్ తమకు మిత్ర దేశమంటూనే.. 25 శాతం టారిఫ్‌లతో పాటు పెనాల్టీలు కూడా విధించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సుంకాల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ప్రచారాన్ని అధికార వర్గాలు కొట్టిపడేశాయి.
Donald Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌లు బాంబు పేల్చాడు. దాదాపు 70కి పైగా దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం పెట్టాడు.
Trump Tariffs Hit AP Aqua Farmers: ఏపీలోని ఆక్వా ఎగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్ భారీగా పడనుంది. ముఖ్యంగా ఆక్వా రంగానికి కేరాఫ్‌గా ఉన్న పశ్చిమ గోదావరిలో తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్‌పై 25 శాతం సుంకాలు విధించడంతో.. ఆక్వా రంగం ఒడిదుడుకులకు గురవనుంది. రైతులపై 25 శాతం పన్ను భారం పడనుంది. ఇప్పటివరకు రొయ్యలపై 3 నుంచి 4 శాతంగా సుంకం ఉన్న విషయం తెలిసిందే. లక్ష రూపాయలు విలువ చేసే రొయ్యలు ఎగుమతి చేయాలంటే..…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తానే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేసేలా ఒప్పించానని చెప్పాడు. ఇప్పటికే ఈ విషయాన్ని 20 కన్నా ఎక్కువ సార్లు ట్రంప్ చెప్పాడు. మరోవైపు, ట్రంప్ వ్యాఖ్యలపై భారతదేశంలో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని మోడీ ట్రంప్‌కు లొంగిపోయాడని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇలా ఉంటే, పాకిస్తాన్ డీజీఎంఓ, భారత డీజీఎంఓకి కాల్ చేసి, కాల్పుల విరమణను కోరడంతోనే…