Israel Iran Conflict: ఇరాన్ పై మరోసారి విరుచుకుపడినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. టెహ్రాన్ లోని ఆరు ఇరానియన్ సైనిక విమానాశ్రయాలను దాడి చేయగా.. అందులో ఉన్న 15 ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు పూర్తిగా ధ్వంసం అయినట్లు పేర్కొన్నాయి.
Donald Trump: ఇరాన్ లో నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్‌గా మార్చాలని తన సోషల్ మీడియా ట్రూత్‌లో ట్రంప్ ఓ పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, దాని సైన్యం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవలి భారతదేశం-పాకిస్తాన్ వివాదంలో ‘నిర్ణయాత్మక దౌత్య జోక్యం’ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని సిఫార్సు చేస్తూ పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అధికారికంగా నార్వేలోని నోబెల్ శాంతి బహుమతి కమిటీకి ఒక లేఖ పంపారు. పాకిస్తాన్ ప్రభుత్వం…
ఇరాన్ ప్రతికార దాడులకు దిగితే, మేం గట్టిగా జవాబిస్తాం అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ పేర్కొన్నారు. ఇక, మేము టెహ్రాన్ సైన్యాన్ని, ప్రజలను టార్గెట్ చేయలేదు.. ఓన్లీ అణు స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని తెలిపారు.
ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా ప్రత్యక్షంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా సైన్యం వైమానిక దాడులను ఖండించారు. అనంతరం పాకిస్థాన్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్…
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా “నేరపూరిత ప్రవర్తన” కలిగి ఉందని అరఘ్చి ఆరోపించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక…
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ప్రవేశించడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను పెంచింది. కాగా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ అమెరికాను ప్రశంసించడంలో మునిగిపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వైట్ హౌస్‌లో విందు చేశారు. ట్రంప్‌ను సంతోషపెట్టడానికి, మునీర్ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. నిన్న, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ కూడా దీనికి మద్దతు ఇచ్చారు. Also Read:Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా…
ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు – ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికా దాడులకు ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆశయాలే కారణమని బహిష్కృత క్రౌన్ ప్రిన్స్ రెజా షా పహ్లవి ఆరోపించారు. సుప్రీం నాయకుడు ఖమేనీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడిపై స్పందిస్తూ, రెజా షా పహ్లవి Xలో ఇలా రాసుకొచ్చారు.. “ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్ అణ్వాయుధాల కోసం చేసిన వినాశకరమైన ప్రయత్నం ఫలితంగా…
Iran -Israel : ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించిందని మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అనే కీలక అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని శనివారం ఆయన “ట్రూత్ సోషల్” వేదికగా తెలిపారు. “ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై మేం చేసిన దాడి పూర్తి విజయవంతంగా ముగిసింది. మా బాంబర్లు ఫోర్డోపై పూర్తి స్థాయిలో…