వేణు స్వామి.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. కొందరి జాతకాలు నిజం అవ్వగా మరికొంతమందికి అబద్దం కూడా అయ్యాయి.. అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన ఈ మధ్య సినిమా డైలాగులతో రీల్స్ కూడా చేస్తున్నాడు.. ఆ వీడియోలు…
ఈ మధ్య వెండి తెర నటీనటులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు.. మనస్పర్థలు కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు.. అదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.. తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన ఎవరో, ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.. బుల్లితెర హీరో పవన్ సాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. చాలా సీరియల్స్ లో హీరోగా చేసిన…
Delhi High Court: భర్తపై నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో అతడిని ‘స్త్రీలోలుడి’గా చిత్రీకరించడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట అని, ఇది వివాహ రద్దుకు కారణమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం భర్త దాఖలు చేసిన క్రూరత్వానికి సంబంధించిన విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలని, అవసరమైన సమయాల్లో రక్షణ కవచంలా ఉండాలని ఆశిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది.
Delhi High Court: విడిపోయిన భార్యభర్తల నెలవారీ భరణానికి సంబంధించిన కేసును విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహేతుకమైన సంపాదించగల సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామి, తగిన వివరణ లేకుండా నిరుద్యోగిగా, పనిలేకుండా ఉండకూడదని, తన ఖర్చులను భర్త ఏకపక్షంగా భరించడానికి అనుమతించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ) కింద విడిపోయిన భార్యకు భర్త చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.30,000 నుంచి 21,000లకి తగ్గిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉంటున్న వ్యక్తికి సంబంధించిన కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కామపూరిత, వ్యభిచార జీవితం’’ గడుపుతూ, భార్యకు విడాకులు ఇవ్వని వేరే మహిళతో ఉంటున్న వ్యక్తి సంబంధాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’’ అని పిలువలేమని కోర్టు అభిప్రాయపడింది. తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ కుల్దీప్ తివారీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.
Gautam Singhania Couple Divorce: టెక్స్‌టైల్ దిగ్గజం రేమండ్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండీ గౌతమ్ గౌతమ్ సింఘానియా సంచలన ప్రకటన చేశారు. తన భార్య నవాజ్ మోడీ సింఘానియా నుంచి విడిపోయానంటూ సోమవారం గౌతమ్ సింఘానియా ట్విటర్(ఎక్స్) వేదికగా ప్రకటించారు.
Father brought back Daughter to home with band baaja baaraat form her in-laws house: సాధారణంగా ఏ తండ్రైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూడలేక చాలా బాధపడుతుంటాడు. ఇక కుమార్తె విడాకులు తీసుకుంటానంటే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అయితే అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసిన ఓ తండ్రి.. తన కూతురికి ఘన స్వాగతం పలికాడు. అచ్చం పెళ్లి బరాత్ మాదిరే.. భాజాభజంత్రీలు, బాణసంచా సందడి మధ్య…
Shikhar Dhawan divorce with Wife Aesha Mukerji: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. ఆయేషా కారణంగా గబ్బర్ మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి…
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది.
యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది.