వేణు స్వామి.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సెలెబ్రేటిల చెబుతూ బాగా ఫేమస్ అయ్యాడు.. సమంత, ప్రభాస్, రష్మిక, విజయ్ అంటూ ఇలా ట్రెండీ స్టార్ల మీద వేణు స్వామి తనకు తోచినట్టుగా చెబుతుంటాడు.. కొందరి జాతకాలు నిజం అవ్వగా మరికొంతమందికి అబద్దం కూడా అయ్యాయి.. అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన ఈ మధ్య సినిమా డైలాగులతో రీల్స్ కూడా చేస్తున్నాడు.. ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం..
వేణు స్వామి తాజాగా ఓ హీరోయిన్ విడాకుల గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. ఆ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా.. ఆమె ఎవరో కాదు కలర్స్ ప్రోగ్రాం ద్వారా యాంకర్ గా,ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కలర్స్ స్వాతి.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో యాంకర్ గా ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయిన కలర్స్ స్వాతి కి అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది..
ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది.. ఈమె వివాహం, విడాకులు గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కలర్స్ స్వాతి ఓ రోజు నా దగ్గరికి వచ్చి తన జాతకం చూయించుకుంది. అయితే తనకి పెళ్లి జీవితం అచ్చిరాదని,విడాకులు తీసుకుంటుంది అని చెప్పాను.. కానీ కోపడి వెళ్లింది.. ఆమె జాతకంలో అదే ఉంది.. ఇప్పుడు అది జరిగింది అంటూ ఆయన అన్నాడు.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే స్వాతి తన విడాకుల వార్తలపై ఇప్పటికి క్లారిటీ ఇవ్వడం లేదు అని కామెంట్స్ పెడుతున్నారు.