High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళలతో ఉండటంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే మహిళతో ఉంటున్న వ్యక్తికి సంబంధించిన కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కామపూరిత, వ్యభిచార జీవితం’’ గడుపుతూ, భార్యకు విడాకులు ఇవ్వని వేరే మహిళతో ఉంటున్న వ్యక్తి సంబంధాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’’ అని పిలువలేమని కోర్టు అభిప్రాయపడింది. తమ ప్రాణాలకు, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ కుల్దీప్ తివారీతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ కొట్టేసింది.
Read Also: Tiger Nageswara Rao: మా టైగర్ ఫ్లాప్ కాదు హిట్టే.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
తాము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నామని, దీంతో తమను చంపేస్తామని మహిళ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారంటూ పిటిషన్లు పేర్కొన్నారు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళకు పెళ్లి కాలేదని, వ్యక్తికి పెళ్లై భార్య నుంచి విడిగా నివిసిస్తున్నట్లు కోర్టు గమనించింది. లివ్ ఇన్ లో ఉన్న వ్యక్తి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ప్రస్తుతం తల్లితో నివసిస్తున్నారు.
భార్యకు విడాకులు ఇవ్వకుండా, న్యాయస్థానం నుంచి విడాకులు చెల్లుబాటు అయ్యే డిక్రీని పొందకుండా వివాహం నిలిచి ఉండగా.. వేరే మహిళతో కామపూరిత జీవితాన్ని గడుపుతున్నాడని, ఇది ఐపీసీ సెక్షన్ 494/495 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ సంబంధ స్వభావాన్ని ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’గా పేర్కొనలేమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాణాలకు ముప్పు ఉందనే ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. బెదిరింపులను గుర్తించడానికి ఎటువంటి ఆధారాలు, ఉదాహరణలు లేవని కోర్టు పేర్కొంది. ఈ కేసులో వ్యభిచారానికి వ్యతిరేకంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ ను నివారించడానికి ప్రస్తుతం పిటిషన్ వేసినట్లు కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో వారు కోరకున్న రక్షణలు మంజూరు చేయడానికి న్యాయస్థానానికి నిర్ధిష్ట కారణాలు కనుగొనబడలేదని, ఈ పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..