Divorce Celebration: అచ్చు పెళ్లి బరాత్ మాదిరే.. కూతురుకి విడాకుల ఊరేగింపు చేసిన తండ్రి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father brought back Daughter to home with band baaja baaraat form her in-laws house: సాధారణంగా ఏ తండ్రైనా తన కుమార్తె అత్తింట్లో కష్టాలు పడుతుంటే చూడలేక చాలా బాధపడుతుంటాడు. ఇక కుమార్తె విడాకులు తీసుకుంటానంటే ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. అయితే అత్తింట్లో తన కుమార్తె అనుభవిస్తున్న కష్టాలను చూసిన ఓ తండ్రి.. తన కూతురికి ఘన స్వాగతం పలికాడు. అచ్చం పెళ్లి బరాత్ మాదిరే.. భాజాభజంత్రీలు, బాణసంచా సందడి మధ్య అత్తింటి నుంచి పుట్టింటికి భారీ ఊరేగింపుగా తీసుకొచ్చాడు. ఈ అరుదైన ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
రాంచీలోని కైలాశ్‌నగర్ కుమ్హర్టోలి ప్రాంతంలో నివసించే ప్రేమ్ గుప్తా అనే వ్యక్తికి కుమార్తె సాక్షి గుప్తా ఉంది. 2022 ఏప్రిల్ 28న రాంచీలోని సర్వేశ్వరి నగర్‌కు చెందిన సచిన్ కుమార్ అనే వ్యక్తితో కుమార్తె వివాహం ఘనంగా చేశాడు. ఝార్ఖండ్ విద్యుత్ పంపిణీ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా సచిన్ పనిచేస్తున్నాడు. వివాహం అయిన కొన్ని రోజులకే సచిన్ తన భార్య సాక్షిని వేధింపులకు గురిచేశాడు. కొన్నిసార్లు కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేవాడు. సచిన్ తల్లిదండ్రులు ఏమీ అనక పోగా.. తన కుమారుడికి సపోర్ట్ చేశేవారు.
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు కొద్దినెలల క్రితమే తెలిసినా.. అతడితో వివాహ బంధం కొనసాగించాలనే సాక్షి తొలుత నిర్ణయించుకుంది. కానీ వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌తో కలసి ఉండలేనని సాక్షి నిర్ణయించుకుంది. తన వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలనుకుంటున్నాని సాక్షి తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు స్వాగతించారు. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేందుకు ప్రేమ్ గుప్తా ఘనంగా ఏర్పాట్లు చేశారు. భాజాభజంత్రీలు, టపాసులు కాలుస్తూ ఆమెకు పుట్టింటికి స్వాగతం పలికారు.
Also Read: Rohit Sharma Bowling: బంతి పట్టిన రోహిత్ శర్మ.. బంగ్లాకు చుక్కలు తప్పవా?
తన కుమార్తె వేధింపుల నుంచి విముక్తి పొందిందని, ఆ ఆనందంతోనే ఇలా ఇంటికి తీసుకొని వచ్చినట్లు సాక్షి తండ్రి ప్రేమ్ గుప్తా తెలిపారు. కుమార్తెలు ఎంతో విలువైనవారని, అత్తింట్లో వారికి ఇబ్బందులు ఎదురైతే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇక సచిన్‌తో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో సాక్షి కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. భాజాభజంత్రీలు, బాణసంచా సందడికి తీసుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!