ఈ మధ్య వెండి తెర నటీనటులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు.. మనస్పర్థలు కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు.. అదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.. తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన ఎవరో, ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం..
బుల్లితెర హీరో పవన్ సాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. చాలా సీరియల్స్ లో హీరోగా చేసిన పవన్ సాయి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఈయన ముద్దమందారం, మొగలిరేకులు, నాగ భైరవి, మల్లీ,శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ లలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.. ముద్ద మందారం నాటిక మాత్రం అందరికి గుర్తిండిపోయింది.. అంతేకాదు సినిమాల్లో కూడా నటించాడు.. అయితే ఈ మధ్య నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే..
అయితే తాజాగా ఈయన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. అందులో ఓ అభిమాని వదిన బాగున్నారా అంటూ అడిగాడు.. దానికి స్పందించిన ఆయన నాతో ఎవరూ లేరు నేను ఒంటరివాడిని అని సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చాడు.. ఆ మాటలతో తన భార్యతో విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.. ఇక ప్రస్తుతం పవన్ సాయి పెద్దగా సీరియల్స్ లలో కనిపించినట్లు లేరు..