Gautam Singhania Couple Divorce: టెక్స్‌టైల్ దిగ్గజం రేమండ్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండీ గౌతమ్ గౌతమ్ సింఘానియా సంచలన ప్రకటన చేశారు. తన భార్య నవాజ్ మోడీ సింఘానియా నుంచి విడిపోయానంటూ సోమవారం గౌతమ్ సింఘానియా ట్విటర్(ఎక్స్) వేదికగా ప్రకటించారు. కాగా కొద్ది రోజులుగా గౌతమ్ సింఘానియా, నవాజ్ మోదీ సింఘానియా విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సింఘానియా ప్రకటనతో ఈ ఊహాగానాలను నిజం చేసినట్లయింది. దీంతో తమ 32 ఏళ్ల వైవాహికి జీవితానికి సింఘానియా కపుల్ నవంబర్ 13న స్వస్తీ పలికారు. కాగా గత వారం గౌతమ్ సింఘానియా హోస్ట్ చేసిన దీపావళి వేడుకకు ఆయన భార్య నవాజ్‌ను అనుమతించని విషయం తెలిసిందే. ఈ మేరకు నవాజ్ మోదీ ఓ వీడియో విడుదల చేశారు.
Also Read: Udupi Crime: ఆటోలో వచ్చి.. నలుగురిని హత్య చేసిన దుండగుడు!
అయితే కార్యక్రమానికి నవాజ్ మోడీని రాకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. ఈ పార్టీకి తనకు అనుమతి ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డులు తనను అడ్డుకున్నారని ఆమె వీడియోలో ఆరోపించారు. ఇక ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రోజునే గౌతమ్ సంఘానియా భార్యతో విడిపోయానంటూ వెల్లడించారు. ఈ సందర్భంగా సింఘానియా తన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు. ‘గతంలో మాదిరి ఈ దీపావళి ఉండబోదు. 32 సంవత్సరాలుగా జంటగా కలిసి ప్రయాణించిన మేము ఒకరికి ఒకరం అండగా నిలిచాం. సంకల్పం, నిబద్ధత, విశ్వాసంతో ప్రయాణం చేశాం. ఈ ప్రయాణంలో మా జీవితాల్లోకి మరో రెండు అద్భుతాలు(తమ ఇద్దరు పిల్లలు) జతయ్యాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర పరిణామాల తర్వాత.. ఇకపై నవాజ్, నేను భిన్న దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నాము‘ అంటూ రాసుకొచ్చారు. అలాగే ఈ మధ్య కాలంలో చాలా నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి. గాసిప్‌లు వచ్చాయి. ఆమె నుంచి నేను విడిపోతున్నాను. తల్లిదండ్రులుగా మా కూతుళ్లు నిహారిక, నీసాకు మంచి జీవితం అందించే బాధ్యతల్ని మాత్రం మేము కొనసాగిస్తాం. మా వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి.. మా ప్రైవసీని కాపాడతారని ఆశిస్తున్నాను’ అంటూ గౌతమ్ సింఘానియా పోస్ట్ చేశారు.
Also Read: TS High Court: ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జిల బదిలీ