Namitha Divorce: విడాకుల రూమర్స్.. నమిత ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Namitha on Divorce Gossips: 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో నమిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీలో పలు సినిమాలు చేశారు. సూరత్‌కు చెందిన నమిత.. తమిళ టాప్ చిత్రాల్లోనూ నటించి చెన్నైలోనే సెటిలైపోయారు. ఓ సమయంలో కోలీవుడ్ హాట్ క్వీన్‌గా ఆమె వెలుగొందారు. అయితే తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నమిత.. బరువు పెరగడంతో క్రమంగా సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది.
సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత పలు రియాల్టీ షోలలో జడ్జిగా నమిత చేశారు. 2017లో వీరేంద్ర చెలత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరికి కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న నమిత.. బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ తరపున ఆమె ప్రచారం చేశారు. అయితే విభేదాల కారణంగా నమిత, వీరేంద్ర విడాకులు తీసుకుని విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విడాకుల రూమర్స్‌పై నమిత స్వయంగా స్పందించారు.
Also Read
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
Also Read: Rajinikanth-Sathyaraj: విభేదాలకు ముగింపు.. కలిసిపోయిన రజనీకాంత్, సత్యరాజ్!
నా భర్తతో కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేసినా విడాకుల రూమర్స్ రావడం బాధాకరం అని నమిత పేర్కొన్నారు. ‘మా విడాకుల పుకార్లు రాకముందే.. నా భర్తతో కలిసి ఉన్న ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ మేం విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నటిగా నేను చాలా రూమర్స్‌ను ఎదుర్కొన్నాను. ఈ విడాకుల రూమర్‌ను నేను, నా భర్త సీరియస్‌గా తీసుకోలేదు. ఈ వార్తలు చూసి మేం నవ్వుకున్నాం’ అని నమిత స్పష్టం చేశారు. తెలుగులో బిల్లా, సింహ లాంటి హిట్ సినిమాల్లో నమిత నటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!