Lover Attack: పాత బస్తీలో దారుణం.. కత్తిపీటతో ప్రియురాలిని గొంతు కోసిన ప్రియుడు..
- పాత బస్తీలో దారుణం
- ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి
- దాడి చేసింది చిన్ననాటి స్నేహితుడే..
- కొద్దిరోజులుగా దూరం పెట్టడంతో ఆగ్రహంతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Attack: పాత బస్తీలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పాత బస్తీలో ఛత్రినాకలో తల్లీతో పాటు శ్రావ్య ఛత్రినక ఎస్ఆర్టీ కాలనీ లో నివాసం ఉంటుంది. గతంలో పెళ్ళి అయిన శ్రావ్య విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. మణికంఠ, శ్రావ్య లు చిన్ననాటి స్నేహితులు. శ్రావ్యకు స్కూల్ నుండే మణికంఠ పరిచయం ఉంది. మణికంఠ గౌలిపుర చెందినవాడు. అయితే ఇద్దరు మధ్య ప్రేమాయనం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఏమైందో ఏమోగానీ.. శ్రావ్య తన ప్రియుడ్ని దూరం పెట్టంది. అది భరించని మణికంఠ ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. ఆమె ఒంటరిగా ఉండే సమయం కోసం ఎదురుచూశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది.
Read also: Tapsee Pannu : అందువల్లే తాప్సికి బాలీవుడ్ ఆఫర్లు
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
శ్రవ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటిలోని వెళ్లాడు. మణికంఠను చూసిన శ్రావ్య షాక్ తింది. ఇంటిలోకి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించింది. ఇన్నిరోజులుగా తనతో ఉండి ఇప్పుడు తనకు దూరం పెడతావా అంటూ శ్రావ్య పై మణికంఠ దాడి చేశాడు. దీంతో శ్రావ్య ఇంటిలో నుంచి బయటకు వచ్చే క్రమంలో మణికంఠ అక్కడే వున్న కత్తిపీటతో ఆమెపై దాడి చేసి గొంతుకోశాడు. దీంతో శ్రావ్య గట్టిగా కేకలు వేసింది. శ్రవ్య అరుపులు విన్న ఇంటి యజమాని ఇంటిలోకి వచ్చి చూడగా కంగారు పడ్డాడు. వెంటనే మణికంఠను పక్కకు తోసివేయడంతో శ్రావ్య ప్రాణాలతో బయట పడింది. దీంతో స్థానికులు అందరూ అక్కడకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు శ్రావ్యను ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మణికంఠనం అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారు.
Read also: Tapsee Pannu : అందువల్లే తాప్సికి బాలీవుడ్ ఆఫర్లు
శ్రావ్య ఘటనపై స్థానికులు ఎమన్నారంటే..
పాతబస్తీ ఛత్రినాక కు చెందిన శ్రావ్య రెండు ఏళ్లుగా మా కాలనీలో ఉంటుందన్నారు. గౌలిపుర కు చెందిన మణికంఠ, శ్రావ్య లు చిన్ననాటి స్నేహితులు. మొదటి భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తుంది. మేము ఎప్పుడు అతన్ని చూడలేదు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి మణికంఠ ఇంట్లొకి వెళ్ళాడు. ఈ రోజు ఉదయం ఆమె తల్లి డ్యూటీ వెళ్ళింది. స్థానికంగా కస్మాటిక్స్ స్టార్ లో శ్రావ్య పని చేస్తుంది. కొద్ది రోజులుగా ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీఠతో గొంతు కోయడంతో పాటు ముఖం పై దాడి చేశాడని తెలిపారు. అరుపులు విని కిటికీ అద్దాలు పగులకొట్టి చూసామన్నారు. అంతలోనే బిక్సింగ్ రెండవ అంతస్తు నుండి దూకి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాడన్నారు. మా బాబు పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు తెచ్చాడని తెలిపారు. అందరం కలిసి మణికంఠ పట్టుకుని పోలీసులకు అప్పగించామనని స్థానికులు వెల్లడించారు.
ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో శ్రావ్య పై మణికంఠ దాడి చేశాడు. సమాచారం అందగానే ఘటనస్థలికి చేరుకున్నం. మణికంఠను అదుపులోకి తీసుకున్నాం. బాధితురాలు శ్రావ్య తల్లితో కలిసి ఎస్ఆర్టి కాలనీ లో నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల క్రితం వరంగల్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి మణికంఠ దూరపు బంధువు.. ఇంటికి వస్తువు పోతూ ఉండేవాడని తెలిపారు. శ్రావ్యకు 2019లో హర్ష తో వివాహం జరిగింది.. ఇద్దరికీ మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు కేసు కోర్టులో నడుస్తుందని తెలిపారు. శ్రావ్య భర్తతో విడిపోవడంతో తాను పెళ్లి చేసుకుంటానంటూ మణికంఠ ప్రపోజల్ పెట్టాడని, విడాకులు కోర్ట్ పరిధిలో ఉన్నందున కొన్నాళ్ళు ఆగాలంటూ శ్రావ్య చెప్పిందన్నారు. శ్రావ్య వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అంటూ మణికంఠ కోపం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా సరిగా మాట్లాడడం లేదు అంటూ కోపంతో రగిలిపోయాడన్నారు. ఇందులో భాగంగానే జిమ్ కు వెళ్లి వస్తున్న క్రమంలో శ్రావ్యను మణికంఠ వెంబడించాడన్నారు. శ్రావ్య ఇంట్లోకి వెళ్ళంగానే మణికంఠ గడియ పెట్టి ఆమెపై దాడి చేశాడు. అప్పటికే శ్రావ్య కాల్ మాట్లాడుతుండడంతో మరింత రెచ్చిపోయిన మణికంఠ స్క్రూ డ్రైవర్ తో ఆమెపై దాడి చేశాడని పేర్కొన్నారు. శ్రావ్య చాతి భాగంతో పాటు మొహం భాగంలో గాయాలయ్యాయని, ప్రస్తుతం శ్రావ్య అవుట్ ఆఫ్ డేంజర్ లో వుందని తెలిపారు.
Supreme Court : నీట్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!