Kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాఘట్టం మహాకుంభాభిషేకం నేడు (ఆదివారం) వైభవంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహకుంభాభిషేకం పూజలు ఘనంగా జరుగాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, రాజగోపురాల కలశాల సంప్రోక్షణ పూజలు, మహాకుంభాభిషేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపం వద్ద పీఠాధిపతికి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు.
Also Read: India vs England: కోహ్లీ, వరుణ్ చక్రవర్తి ఇన్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లీష్ జట్టు
ఈ సందర్భంగా తుని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి అనుగ్రహభాషణం అందించారు. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉంటాయని, కాళేశ్వర స్వామి దర్శనం ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాఘట్టం మహాకుంభాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పొడవైన క్యూలైన్లలో నిలబడి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాజగోపురాలకు సంప్రోక్షణ పూజలు, కుంభాభిషేకం కన్నుల పండుగగా నిలిచాయి. ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతోపాటు, కాళేశ్వర క్షేత్రానికి ప్రత్యేకతను మరింత పెంచింది.
Also Read: Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాగ్ మయూర్