Kanchi Kamakshi: తమిళనాడులోని కాంచీపురం నగరంలో కొలువైన కామాక్షి అమ్మవారు కోరికలు నెరవేర్చే మహాశక్తి ప్రదాయినిగా భక్తులచే ఆరాధించబడుతోంది. కామాక్షి అమ్మవారి ఆలయానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఆరవ శతాబ్దంలో పల్లవ రాజవంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక వృత్తాంతాలు చెబుతున్నాయి. అమ్మవారు యోగముద్రలో పద్మాసనంపై కూర్చుని చేతుల్లో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. ఇది ఆధ్యాత్మికంగా ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతని అందించింది. కాంచీపురం నాభిస్థాన శక్తిపీఠంగా ప్రసిద్ధి. కామాక్షి అనే పేరుకి అర్థం విశేషమైనది. ఇందులో ‘కా’ అంటే సరస్వతీ దేవి రూపం, ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం, ‘అక్షి’ అంటే కన్ను. ఈ ప్రకారం అమ్మవారు సరస్వతీ దేవి, లక్ష్మీదేవి రూపాలతో భక్తులకు దర్శనమిస్తారనే నమ్మకం ఉంది.
Also Read: Gold Price : మరో సారి షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?
కామాక్షి అమ్మవారిపై భక్తులకు అత్యంత విశ్వాసం. ఇందులో భాగంగా ఓ భక్తుడు తమ కుటుంబం తరపున 10 కిలోల రాగితో తయారు చేసిన వీణను బంగారం పూత పూయించి అమ్మవారికి బహుకరించారు. నీరజా విజయకుమార్ కుటుంబం అమ్మవారికి ఈ బహుమతిని సమర్పించింది. ఈ పూజా కానుక అమ్మవారి దివ్యరూపానికి మరింత శోభను తెచ్చింది. కాంచీపురం మోక్షదాయకమైన పట్టణం అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్ర స్థలంలో కామాక్షి అమ్మవారిని దర్శించుకుంటే శాంతి, సౌభాగ్యం, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రత్యేకంగా అమ్మవారికి అర్చనలు నిర్వహించి దివ్య ఆశీర్వాదాలను పొందే భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ప్రస్తుతం అమ్మవారికి సమర్పించిన వీణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కంచి కామాక్షి అమ్మవారికి కానుకగా 10 కిలోల బంగారు వీణ…#SriKanchiKamakshiAmmanTemple #Kanchipuram #TamilNadu #BhakthiTV pic.twitter.com/3YGyEoNaf5
— BhakthiTV (@BhakthiTVorg) February 13, 2025