కరోనా పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా రెస్పిరేటరీ సిస్టమ్‌పై దాడి చేస్తుంది కాబట్టి మెరుగైన శ్వాసను తీసుకోవడానికి అనుగుణంగా యోగా క్లాసులను నిర్వహించనున్నారు. వ్యాధినిరోదక శక్తిని పెంచే యోగాసనాలు, ప్రాణాయామం వంటి వాటికి సంబంధించిన క్లాసులను నిర్వహించనున్నారు. ఢిల్లీకి యోగశాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా…
ఢిల్లీలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 1000 నుంచి 20 వేలకు పెరిగాయి. ఈ స్థాయిలో కేసులు పెరగడంతో ఢిల్లీ సర్కార్ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నది. అయితే, ఆదివారం రోజున 22 వేలకు పైగా కేసులు నమోదవ్వగా, సోమవారం రోజున 19 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. సుమారు మూడు వేల వరకు కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంపై…
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది.. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించింది ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్.. అయినా.. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మినహాయించిన కేటగిరీకి చెందిన ప్రైవేట్ కంపెనీలు మినహా అన్ని ఆఫీసులు మూసివేయాల్సిందేనని పేర్కొంది.. ఇప్పటి వరకు,…
దేశంలోకి థర్డ్ వేవ్ ఎంటర్ అయిందని చెప్పడానికి పెరుగుతున్న కేసులే ఉదాహరణగా చెప్పవచ్చు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, ముంబై, ఢిల్లీ వంటి మహానగరాల్లో ప్రతిరోజూ కేసులు పీక్స్‌లో నమోదవుతున్నాయని, జనవరి మిడిల్ వరకు 30 వేల నుంచి 60 వేల మధ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త మహీంద్రా అగర్వాల్ పేర్కొన్నారు. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్యకూడా…
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 20,181 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో 48,178 కేసులు యాక్టీవ్‌గా ఉండగా, 24 గంటల్లో 11,869 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం 25,143 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.6 శాతంగా ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.…
స్వీట్ అంటే ఇష్టపడని వారెవరు.. పండగ అయినా, శుభకార్యం అయినా స్వీట్ లేకుండా పూర్తవదు. తీపి కబురు చెప్పడానికైనా, తీపి ముచ్చట్లు పెట్టుకోవడానికైనా స్వీట్ కంపల్సరీ. అయితే ఒక కేజీ స్వీట్స్ ఎంత ఉంటుంది.. రూ. 300.. పోనీ రూ. 500. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ, ఇక్కడం మనం చెప్పుకొనే మిఠాయి కేజీ రూ. 16 వేలు. ఏంటీ తమాషా చేస్తున్నారా..? ఒక్క కేజీ స్వీట్స్ అంత రేటు ఎందుకు అని కోపంగా చూడక్కర్లేదు. ఎందుకంటే…
సాధారణంగా ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. ఆ భయంతోనే కొన్ని అనుకోని తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు ఆ భయాలు వారి ప్రాణాలమీదకు తెస్తాయి. తాజాగా ఒక ఖైదీ.. అధికారులు తనను ఏమన్నా చేస్తారన్న భయంతో ముందు వెనుక చూడకుండా సెల్ ఫోన్ ని మింగేశాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఢిల్లీ తీహార్ జైల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తీహార్ జైలు నెం. 1 లో ఒక వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా వచ్చాడు. కొన్ని…
కొత్త సంవత్సరం వేడుకలు ముగిసిన రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. వారం క్రితం రోజువారి కేసులు పదివేల లోపు ఉండగా, ఇప్పుడు రోజువారి కేసుల సంఖ్య 90 వేలు దాటింది. ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. దేశరాజధానిలో గడిచిన 24 గంటల్లో 15,097 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో మృతి చెందారు. ఇది కొంత ఊరటనిచ్చే అంశమే. కేసులు పెరుగుతున్నా మరణాల…