కరోనా మహమ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది. ఆర్ ఫ్యాక్టర్ ఇప్పటికే 2 గా నమోదంది. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వైరస్ తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్రప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని, కానీ ప్రజలెవరూ ప్యానిక్ కావొద్దని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయని, ఈరోజు 3100 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని…
కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. దక్షిణాదిన కేరళ రాష్ట్రంలో కొత్త కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ప్రభావం కారణంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదలతో ఆసుపత్రులపై క్రమంగా ఒత్తిడి పెరగడం ప్రారంభం అయింది. వెంటనే కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. Read: ఢిల్లీ,…
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో 2716 కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన కేసుల కంటే 51శాతం అదనంగా కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో పాజిటివిటి రేటు 3.64శాతంగా ఉంది. పాజిటివిటి రేటు 0.5 శాతంగా ఉన్న సమయంలోనే ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. అయితే, ఇప్పుడు పాజిటివిటి రేటు 3.64…
ఒమిక్రాన్ భారతదేశాన్ని సైతం వణికిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం, కోవిడ్-19 కేసుల సంఖ్య కూడా రోజురోజుకు అధికసంఖ్యలో నమోదు కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. మార్కెట్ ప్రాంతంలో దుకాణాలను “ఆడ్, ఈవెన్” పధ్దతిలో తెరిచేందుకు అనుమతించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన “ఎల్లో అలర్ట్“ మరి కొంతకాలం కొనసాగవచ్చు. కోవిడ్ పాజిటివిటీ రేటు…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త వేరియంట్ సునామిలా విరుచుకు పడుతోంది. ఉప్పెనలా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా కేసులు స్పీండందుకున్నాయి. కేవలం మూడు రోజులలో పరిస్థితి మారింది. బుధవారం ఒక్క రోజే 13,154 మందికి వైరస్ సోకింది. మంగళవారంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఇక, ఒమిక్రాన్ విషయానికి వస్తే ప్రస్తుతం అది 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. ఈ రకం కేసుల సంఖ్య వెయ్యికి…
ఢిల్లీలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో 923 కేసులు నమోదైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నిన్నటి రోజున నమోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటికే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో సినిమా హాళ్లు, స్కూళ్లను మూసివేశారు. 50 శాతం సీటింగ్‌లో హోటళ్లు, మెట్రోలు, బార్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని,…
దేశంలో కోవిడ్ ముప్పు తొలగడం లేదు. గత కొంతకాలంగా తక్కువగా నమోదవుతున్న కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. క్రమంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. తాజాగా 9195 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 77,002 వున్నాయి. మరోవైపు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు. దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ లో అత్యధికంగా 238 కేసులు నమోదు కావడంతో ఆందోళన కలుగుతోంది. నిన్నటి “కోవిడ్” కేసులు…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు భారత్‌ను టెన్షన్ పెడుతోంది.. దేశ రాజధాని ఢిల్లీ సహా.. మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇక, ఢిల్లీలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.. దీంతో.. అప్రమత్తమైన ఆమ్ ఆద్మీ సర్కార్.. దేశ రాజధానిలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అయితే, ఎలాంటి…
ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్‌లో జరిగిన ఒక సంఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 62 ఏళ్ళ సతీష్ భరద్వాజ్ చనిపోయినట్టు నిర్ధారించారు 11 మంది వైద్యులు. ఏం అద్బుతం జరిగిందో తెలీదు. చితికి నిప్పంటించే ముందు అతని నోటిలో గంగాజలం పోశాక కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో అతడిని చితిపై నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. కేన్సర్‌తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంత్యక్రియలకు…