తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కుట్ర కేసులో కీలక దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ డ్రైవర్ ను, పీఏను విచారించనున్నారు పోలీసులు. అలాగే, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ల పాత్ర పై విచారణ చేయనున్నారు పోలీసులు. మంత్రి హత్య కుట్ర కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చారు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్.
ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు సైబరాబాద్ పోలీసులు. గత నెల 25 న …పేట్ బషీరాబాద్ లోని ఒక లాడ్జ్ వద్ద తనను చంపేందుకు చూశారని ఫరూఖ్ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి యాదయ్య, విశ్వనాథ్,నాగరాజు ను అరెస్ట్ చేశారు పోలీస్ లు.
వీరిని విచారించి.. ఢిల్లీ లోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలో రాఘవేందర్ రెడ్డి, మున్నూరు రవి ,మధుసూదన్ రాజు, అమరేందర్ లను అరెస్ట్ చేశారు. మంత్రి హత్య కు సుపారీ ఇచ్చిన విషయం చెప్పినందుకే..తనను చంపేందుకు చూసారంటున్నాడు ఫరూఖ్. నలుగురు నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించి.. న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు పోలీస్ లు. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులను కస్టడీ కి కోరుతూ నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పేట్ బషీరాబాద్ పోలీస్ లు.