CPI Narayana: ఢిల్లీలో భరతనాట్యం.. ఏపీలో శివతాండవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏ విషయం మీదనైనా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ఆయన రూటే సపరేటు. అంతా వివిధ సమస్య గురించి మాట్లాడితే.. మొన్నామధ్య బిగ్ బాస్ గురించి విమర్శలు చేశారు. తిరుపతిలో నారాయణ ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చును అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నా అన్నారు. బీజేపీ ఎలా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ ఇస్తుంది. వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్ లో ఉన్నాయన్నారు.
వారి సహజీవనం మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్డు మ్యాప్ ఎలా ఇస్తారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నాయకులు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ ఏపీకి వచ్చి శివతాండవమాడుతున్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం ముఖ్యం. బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేనలు మాటెత్తకపోవడం బాధాకరం అన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం బాగా తగ్గిపోయిందని ఒప్పుకున్నారు నారాయణ. మేము బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు మా దగ్గరకు వచ్చినవే. ఇప్పుడు బలం తగ్గడంతో ఆ పరిస్థితి లేదన్నారు నారాయణ.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
పవన్ కళ్యాణ్ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. జనసేనానిలో రాజకీయ స్పష్టత లేదు. ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వైసీపీని వ్యతిరేకించే వారితో పొత్తులుంటుందని చెప్పారు..?కబ్జాల నుంచి, దౌర్జన్యాల నుంచి, అరాచకాల నుంచి బయటకు రావాలని సిఎం ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో జగన్ మాటలతోనే అర్థమవుతోందన్నారు నారాయణ. మూడేళ్ళు రాష్ట్రాన్ని దోచేశామని సీఎం చెప్పకనే చెప్పారు..! మాతో ఏ పార్టీ పొత్తులు పెట్టుకునే అవకాశం లేదన్నారు నారాయణ.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?