RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్ ఫైటర్స్, ఆ రియల్ హీరోలు ఎలా ఉండాలి అని తాను ఊహించుకున్నానో దాన్నే సినిమాలో చూపించానని అన్నారు. అందుకేనేమో రాజమౌళి యూనిక్ డైరెక్టర్ అయ్యారు. ఆయన రివీల్ చేసిన ఈ సీక్రెట్ ఫార్ములా చాలామంది యువ దర్శకులకు స్ఫూర్తిదాయకమని చెప్పాలి. అంతేకాకుండా రాజమౌళి సక్సెస్ కు కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నా వాళ్లకు కూడా ఇప్పుడు ఇది ఓపెన్ సీక్రెట్.
Read Also : RRR : “భీమవరం బుల్లోడా” సాంగ్ అస్సలు నచ్చదు… ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, శ్రియ, అజయ్ దేవగన్, ఒవిలియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా మార్చ్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.