మూడు నెలలు నిండిన గర్భిణులను సర్వీసులో చేర్చుకోకుండా అడ్డుకుంటున్న ఎస్ బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు, ‘వారిని తాత్కాలిక అన్ ఫిట్’ అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం…
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన పెద్ద రచ్చగా మారింది.. అర్వింద్‌ను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని, దాడికి తెగబడ్డాయి.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేసి ఆరా తీశారు.. ఆర్మూర్‌లో టీఆర్ఎస్…
73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సిద్దం అవుతున్నది. ఈనెల 29 వ తేదీన బీటింగ్ రీట్రీట్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. అయితే, ఈసారి బీటింగ్ రీట్రీట్ వేడుకల కోసం ప్రత్యేకంగా డ్రోన్ లు ఆకట్టుకోబోతున్నాయి. సుమారు వెయ్యి డ్రోన్లు ఈ వేడుకలలో పాల్గొంటున్నాయి. వీటికి ప్రత్యేకంగా అమర్చిన లేజర్ లైటింగ్ ద్వారా లేజర్ షోను నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో డ్రోన్ సహాయంతో ఇలా లేజర్‌షోను నిర్వహిస్తున్నారు.…
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ మహమ్మారి కేసులు తగ్గుతుండటంతో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన రాష్ట్రాల్లో ఢిల్లీ కూడా ఒకటి. థర్డ్ వేవ్ మోదలయ్యాక ఢిల్లీలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు గరిష్టంగా 30 శాతానికి నమోదైంది. అయితే, ఇప్పుడు కేసులు ఆదే స్థాయిలో తగ్గిపోయాయి. నిన్న బులిటెన్ ప్రకారం కేసులు…
ఫిబ్రవరి 10 నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఆప్ పోటీకి సిద్దమైన సంగతి తెలిసిందే. కాగా, ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని ఆప్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్ చీఫ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించడం మొదలుపెట్టారు. Read: యూపీలో…
50 ఏళ్లు గా సరిగ్గా “ఇండియా గేట్” కింద నిరంతరం వెలుగుతున్న “అమర్ జవాన్ జ్యోతి” శాశ్వతంగా ఆరిపోనుంది. ఇండియా గేట్ పక్కనే 40 ఎకరాల్లో 176 కోట్ల తో ఏర్పాటు చేసి, 2019, మార్చిలో ప్రధాని మోడీ ప్రారంభించిన “నేషనల్ వార్ మోమోరియల్” వద్ద ఏర్పాటు చేసిన “జ్యోతి”లో ఈ రెండింటిని ఏకం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రక్షణ దళాల ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ ఆధ్వర్యంలో జరిగే అధికారిక…
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఘాజీపూర్ పూల మార్కెట్లో బాంబు ఉందని పోలీసులకు సమాచారం రావడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగి మార్కెట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఐఈడీ పేలుడు పదార్థాలతో కూడిన ఓ బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు, ఎన్ఎస్జీ అధికారులకు సమాచారం అందించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. Read Also: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి పోలీసులు ఇచ్చిన…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేసులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. తాజాగా ఢిల్లీలో 28,867 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి 22,121 మంది కోలుకున్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 94,160 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఢిల్లీలో…
ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడికి ఢిల్లీ సర్కార్ నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నది. ఈ కర్ఫ్యూల వలన కొంత వరకు ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తున్నది. వీకెండ్ కర్ఫ్యూ తరువాత కొంతమేర కరోనా ఉధృతి తగ్గింది. అయితే, ఈ జనవరిలోనే కరోనా పీక్స్ దశకు చేరుకునే అవకాశం ఉందని, కరోనా కేసులు రెండు రోజులు వరసగా తగ్గితే ఆంక్షలను ఎత్తి వేస్తామని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ స్పష్టం చేశారు. కేసులు…