ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్శేఖర్శర్మను అరెస్ట్ చేశారు పోలీసులు.. విషయం ఏంటంటే.. ర్యాష్డ్రైవింగ్కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.. అయితే, అదే రోజు బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు.. Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ.. జాగ్వార్ ల్యాండ్ రోవర్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి, అది దక్షిణ ఢిల్లీ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కారును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు.. కేసులో నమోదు చేసిన ప్రకారం.. ఫిబ్రవరి 22న మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ వెలుపల వేగంగా వస్తున్న ల్యాండ్ రోవర్.. డీసీపీ బెనిటా మేరీ జైకర్ కారును ఢీకొట్టింది. ఇక, శర్మ ఘటనా స్థలం నుండి పారిపోయాడు.
Read Also: Harish Rao: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం..
ఆ సమయంలో డీసీపీ కారును ఆమె డ్రైవర్ కానిస్టేబుల్ దీపక్ కుమార్ నడుపుతున్నాడు.. మిస్టర్ కుమార్ ల్యాండ్ రోవర్ నంబర్‌ను గుర్తించి, వెంటనే డీసీపీకి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత, కారు గురుగ్రామ్‌లోని ఒక కంపెనీలో రిజిస్టర్ చేయబడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, కారు దక్షిణ ఢిల్లీలో నివసించే విజయ్ శంకర్ శర్మ వద్ద ఉందని కంపెనీ వ్యక్తులు పోలీసులకు తెలిపారు. ర్యాష్ లేదా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కేసులో విజయ్ శేఖర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.. బెయిల్‌పై విడుదల చేశారని ఢిల్లీ పోలీసు అధికారి సుమన్ నల్వా ధృవీకరించారు. ఇక, ఒక ప్రకటనలో, Paytm ప్రతినిధి మాట్లాడుతూ.. ఒక చిన్న మోటారు వాహన సంఘటనకు సంబంధించి ఫిర్యాదు దాఖలు చేయబడింది. ఈ ఘటనలో ఏ వ్యక్తికి గానీ, ఆస్తులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదని.. అరెస్ట్‌పై ప్రచారం సరికాదని.. ఎందుకంటే వాహనంపై చేసిన ఫిర్యాదు కూడా చట్టంలోని బెయిలబుల్ నిబంధన ప్రకారం చిన్న నేరానికి సంబంధించినది పేర్కొన్నారు.. అవసరమైన చట్టపరమైన ఫార్మాలిటీలు అదే రోజు పూర్తయ్యాయని వెల్లడించారు పేటీఎం ప్రతినిధి.