Congress: రెండు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్..! రేపే రెబల్స్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస పరాజయాలు కాంగ్రెస్ ప్రతిష్టను పాతాళానికి నెట్టాయి. కాంగ్రెస్ పూర్తిగా రెండు వర్గాలుగా చీలిపోయింది. ఓ వర్గం సోనియా గాంధీ కుటుంబాన్ని సమర్థిస్తుండగా… పార్టీలో సమూల సంస్కరణలు జరగాల్సిందేనని మరో వర్గం వాదిస్తోంది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఏమీ తేల్చలేదు. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా ఉండాలని తాత్కాలికంగా తీర్మానించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మరికొందరు నేతలన్నారు. పార్లెమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాక… మరోసారి CWC మీటింగ్ జరగనుంది. ఇక బుధవారం నాడు కాంగ్రెస్ లో రెబెల్ గా పేరు పడ్డ జీ23 నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, శశిథరూర్ లాంటి నేతలు మీటింగ్ కు రానున్నారు. ఇప్పటివరకు జీ23లో ఉన్నవారే కాకుండా మరికొందరు నేతలు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొనవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత సంస్కరణలు అవసరమని 2020 ఆగస్ట్‌లోనే జీ23 నేతలు హైకమాండ్ కు లెటర్ రాశారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమితో బుధవారం నాటి మీటింగ్ హాట్ హాట్ గా సాగనుంది సమాచారం.
Read Also: AP: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. రేపు వారి ఖాతాల్లోకి సొమ్ము
Also Read
ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకుని ఇతరులకు అవకాశమివ్వాలన్నారు సీనియర్ నేత కపిల్ సిబల్. తాను అందరి కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నానని… కొందరు మాత్రం ఒక ఇంటి కాంగ్రెస్ కావాలనుకుంటున్నారని చెప్పారు. అయితే సిబల్ కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ మానిక్కం ఠాగూర్. కాంగ్రెస్ ను చంపేసి… ఇండియా అనేయ ఐడియాను ధ్వంసం చేసేందుకే కాంగ్రెస్ నాయకత్వం నుంచి గాంధీ కుటుంబం వైదొలగాలని ఆర్ఎస్ఎస్-బీజేపీ కుట్ర చేస్తున్నాయన్నారు. అదే వైఖరితో కపిల్ సిబల్ మాట్లాడారని ఆరోపించారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం కపిల్ సిబల్‌పై స్పందించేందుకు నిరాకరించారు. మీడియా ప్రశ్నిస్తున్నప్పటికీ ఏమీ మాట్లాడాకుండా వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!