భాష హద్దులు, దేశం సరిహద్దులు దాటి తెలుగు సినిమా, భారతీయ సినిమాను తీసుకెళ్ళినందుకు రాజమౌళిపై ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘బాహుబలి’ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మరో సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.ఆదివారం ఢిల్లీ, ఇంపీరియల్ హోటల్ లాన్ లో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అమీర్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు ఈ పాన్-ఇండియా సినిమాల వెనుక ఉన్న సూపర్ హిట్ ఫార్ములాను వెల్లడించమని అడిగాడు.
Read Also : RRR : “భీమవరం బుల్లోడా” సాంగ్ అస్సలు నచ్చదు… ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్
“వాస్తవానికి నేను చేసిన సినిమాలు 4-5 భాషలలో విడుదల అవుతున్నాయి. అయితే అప్పట్లో ఒక్క హిందీలో మాత్రమే తీసిన ‘లగాన్’ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన రన్‌ను సాధించింది. తద్వారా మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా నిలిచింది. యూనివర్సల్ కథతో, ప్రాథమిక మానవ భావోద్వేగాలపై దృష్టి సారించే ఏ సినిమా అయినా భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా ప్రేక్షకులను మెప్పిస్తుందని ‘లగాన్’ చూసిన తర్వాత నాకు అర్థమైంది” అని అన్నారు రాజమౌళి. ఆయన ‘లగాన్’పై ఇలాంటి కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన అమీర్ ఖాన్ ‘లగాన్’ 2001లో విడుదలై సంచలనం సృష్టించింది.