ఏపీకి కొత్త సీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది… ఈ నెల 30వ తేదీన ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ రిటైర్ కానుండగా.. అదే రోజు అంటే రేపు సాయంత్రం జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, వాస్తవానికి ఈ ఏడాది మే నెలలోనే సమీర్ శర్మ పదవీకాలం ముగిసిపోయింది.. కానీ, ప్రభుత్వం ఆయన…
Chattarpur : దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఛత్తార్పూర్ ఏరియాలో సభా వేదికపైనే ఒక మహిళ ఓ నాయకుడిని చెప్పుతో కొట్టింది. దాంతో కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
సహజీవనం చేస్తున్న ప్రియురాలిని పాశవికంగా హత్య చేసి 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ పూనావాలాకు ఈ రోజు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్షలు చేయనున్నారు. ఢిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్సెస్ లాబొరేటరీలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలపై కత్తులతో దాడి జరిగింది. ఢిల్లీలోని రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో రెండో విడత పాలీగ్రాఫ్పరీక్ష ముగిసిన తర్వాత..
Fake CBI: పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ) అనగానే భయపడుతున్నారు. ప్రతీరోజు దేశంలో ఎక్కడో చోట సిబిఐ దాడులు, ఈడీ దాడులు అంటూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
Fake Call : ఢిల్లీలో ఓ స్కూల్ పేరు మీద మొయిల్తో రావడంతో అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హడావుడిగా ఎక్కడికక్కడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏ చిన్న ప్రాంతాన్ని వదలకుండా అణువణువు తనిఖీ చేసి ఏం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భగీరథ్ ప్యాలెస్లో అగ్నిమాపక సిబ్బంది వరుసగా మూడో రోజు శనివారం కూడా మంటలను ఆర్పేందుకు శ్రమిస్తుండగా.. భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
Blood Donation: రక్తదానం చేయడం గొప్పదానంతో సమానం. మనం చేసే రక్తదానంతో ఒకరి ప్రాణం నిలబెట్టవచ్చు. అందుకే రక్తదాతలను ప్రాణదాతలుగా పరిగణిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎన్నడూ రక్తం కొరతతో ఏ ప్రాణం పోకూడదని.. ఇందుకోసం దేశంలోని ఆరోగ్యవంతులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నానని ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చాక అందరం కలిసికట్టుగా…
Jama Masjid bans entry of women who come without men: దేశంలోని సుప్రసిద్ధ ఢిల్లీలోని జామా మసీదు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. మహిళలు, బాలికలు మసీదులోకి రాకుండా వారి ప్రవేశంపై నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. మసీదు నిర్వాహకులు బాలికలు, మహిళలు ఒంటరిగా కానీ గుంపుగా కానీ మసీదులోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ గేట్లపై నోటీసులు అంటించారు. మసీదుకు రావాలంటే వారి కుటుంబంలోని పురుషుడు తప్పని సరి అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం వివాదంగా మారింది.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిసెంబర్ 5న న్యూఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉందని ఆదివారం ఒక అధికారి తెలిపారు.