గుజరాత్ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలగితే దర్యాప్తులో చిక్కుకున్న మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లను విడిచిపెడతామని బీజేపీ ఆఫర్ చేసిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోని అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తేదీలను ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4న నిర్వహించబడుతుంది.
ముగ్గురు ఆర్మీ జవాన్లను చంపిన సంచలనాత్మక 2000 ఎర్రకోట దాడి కేసులో తనకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్‌తో నడిచే వాణిజ్య వాహనాలు, ట్రక్కులు నిషేధించబడ్డాయి. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450కి పడపోవడంతో వాహనాలను నిషేధించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన కుటుంబాన్నే అంతమొందించారు. జీతం ఇచ్చిన యజమాని ఫ్యామిలీని మట్టుబెట్టారు. యువతీ యువకుడు పని చేస్తున్న చోటే ప్రేమ వ్యవహారం నడిపించగా.. అది తెలిసిన యజమాని వారిని విధుల్లో నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న వారు కుటుంబం మొత్తాన్ని కడతేర్చారు.
తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత యోగా తరగతులు ఆగవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 'ఢిల్లీ కి యోగశాల' స్కీమ్ ఫైల్‌పై అక్టోబర్ 26న సంతకం చేశారని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Fire breaks out in Delhi and Pune:దేశ రాజధాని ఢిల్లీతో పాటు పూణే నగరాల్లో మంగళవారం అగ్నిప్రమాదాలు సంభవించాయి. రెండు ప్రమాదాల్లో ప్రాణ నష్ణం సంభవించలేదు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పూణేలోని లుల్లా నగర్ ప్రాంతంలోని ఓ వాణిజ్య భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న ఓ రెస్టారెంట్ లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్వెల్ విస్టా కమర్షియర్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్ లో ఉదయం…
Toyota Fortuner car stolen at gunpoint: నడిరోడ్డుపై గన్ పాయింట్ లో ఓ వ్యక్తి తన టయోటా ఫార్చ్యూనర్ కారును కోల్పోయాడు. దొంగతనానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు కారు యజమానికి గన్ గురిపెట్టి కారును ఎత్తుకెళ్లారు. నైరుతి ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో గన్ గురిపెట్టి 35 ఏళ్ల వ్యక్తి నుంచి కారును దొంగిలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. శనివారం తెల్లవారుజామున 2.19 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్…
Woman in coma for 7 months gives birth to baby girl: ఏడు నెలలుగా కోమాలో ఉండీ.. ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఢిల్లీలోన ఎయిమ్స్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వైద్యశాస్త్రంలోనే అత్యంత అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఓ ప్రమాదం కారణంగా తలకు తీవ్రగాయాలు అయిన మహిళ గత ఏడు నెలల నుంచి ఎయిమ్స్ లోని ట్రామా సెంటర్లో కోమాలోనే ఉంది. ప్రమాదం జరిగే…