Shraddha Walker Case: తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ అమీన్ పూనావాలా బెయిల్ కోరుతూ శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అతని న్యాయవాది వెల్లడించారు. అదనపు సెషన్స్ జడ్జి బృందా కుమారి ఎదుట శనివారం విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు పూర్తయి, ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉన్నందున నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం వల్ల ప్రయోజనం లేదని న్యాయవాది చెప్పారు. డిసెంబర్ 9న పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించారు. పూనావాలా (28) శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన నివాసంలో దాదాపు మూడు వారాల పాటు 300-లీటర్ల రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, నగరం అంతటా వాటిని చాలా రోజుల పాటు పడేశాడు.
Jamia Masjid: స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడం, ఫోటోగ్రఫీపై జామియా మసీద్ నిషేధం
లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న శ్రద్ధా వాకర్‌ని ఆమె పార్ట్‌నర్ అఫ్తాబ్ పూనావాలా మే 18న అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం బాడీని 35 ముక్కులుగా చేసి మెహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నేతలు ఈ హత్యలో లవ్ జిహాద్ కోణం ఉందని ఆరోపించారు. దీంతో ఈ సంఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఈ కేసులో తానే శ్రద్ధాను హత్య చేసినట్లు వెల్లడించాడు అఫ్తాబ్. తన నుంచి శ్రద్ధా దూరం అవుతుందనే ఇలా చేశానని తెలిపాడు. శ్రద్ధాతో రిలేషన్‌లో ఉండగానే మరో హిందూ యువతులను ట్రాప్ చేసినట్లు అంగీకరించాడు. శ్రద్దా శరీర భాగాలను ఫ్రిజ్‌లో ఉంచి, మరో అమ్మాయితో అదే ప్లాట్‌కు తీసుకువచ్చినట్లు వెల్లడించాడు. డేటింగ్ యాప్ ద్వారా పలువురిని ట్రాప్ చేసినట్లు పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లో అంగీకరించాడు.