Twitter: శ్రమదోపిడీకి తెరతీసిన ఎలాన్ మస్క్..కంపెనీలో మిగిలింది 80మంది ఉద్యోగులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కంపెనీలో పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి. కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలోని కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంతో మందిని ట్విట్టర్ తొలగించింది. కంపెనీ వెల్లడించనప్పటికీ, 250 మంది ట్విట్టర్ ఇండియా ఉద్యోగుల్లో దాదాపు 170 మంది ఉద్యోగులు సంస్థ నుండి వెళ్లిపోయారు. ఇందులో ఎక్కువ మందిని మస్క్ తొలగించగా కొందరు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు.
Read Also: Gopichand: జీరో లేకుంటే ఆ హీరో సినిమా హిట్టయ్యేలా లేదు
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
దీంతో ట్విట్టర్ కు భారత్ లో కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. అంటే ఇప్పటి వరకు 250 మంది సంయుక్తంగా చేసిన పనిని.. ఇక మీదట కేవలం 80 మంది ఉద్యోగులే నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రోజుకు 12 గంటల నుంచి 16 గంటల వరకు పనిచేయాల్సి వస్తోంది. వేతనాలు కూడా ఏమీ పెంచకుండానే అధిక పనిగంటలు పని చేయిస్తున్నారు. గతంలో భారత ట్విట్టర్ ఉద్యోగులకు సాయంత్రం స్నాక్స్ ఇచ్చే వాళ్ళు. మస్క్ రాగానే స్నాక్స్ ఇవ్వడం ఆపేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించినప్పటికీ వారి స్థానంలో కొత్తవాళ్ళను తీసుకునే ఆలోచన కూడా ఎలాన్ మస్క్ చేయడం లేదని ట్విట్టర్ వర్గాలు చెప్తున్నాయి. విపరీతమైన శ్రమ దోపిడి జరుగుతున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోందని ఉద్యోగులు బోరు మంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం కారణంగా అన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తీసివేస్తుండటంతో , ప్రస్తుతం ఉద్యోగాలు దొరకడమే కష్టమై పోయింది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న మస్క్ శ్రమదోపిడికి తెరతీశాడనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!