ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం సాధించి తన మార్క్‌ను చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించుతూ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది
తూర్పు ఢిల్లీలో అదృశ్యమైన మూడేళ బాలుడి మృతదేహాన్ని మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలుడిని నవంబర్ 30న ప్రీత్ విహార్‌లోని అతని నివాసం నుండి కిడ్నాప్ చేసి.. యూపీలో హత్య చేశారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్ ప్రారంభంలోనే ఆప్, బీజేపీల మధ్య ప్రారంభ పోకడలు నిమిష నిమిషానికి మారుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. సాధారణ ఎన్నికలను తలపిస్తూ దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య ఉత్కంఠ భరిత వాతావరణంలో డిసెంబర్ 4న ఈ ఎన్నిక జరిగింది. నేడు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వరంగల్‌లో ఆమె యాత్రను అడ్డుకోవడం, దాడి కూడా జరిగిన తర్వాత.. ఒక్కసారిగా వైఎస్ షర్మిలపై ఫోకస్ పెరిగింది.. వరంగల్ ఘటనకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిలను కారుతో పాటు పీఎస్‌కు తరలించడం కూడా చర్చగా మారింది.. అరెస్ట్‌లు, బెయిల్‌పై విడుదల కావడం.. ఆ తర్వాత రోజు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలవడం,…
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.. ఇవాళ రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.. ఇక, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పధాదికారుల సమావేశాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. ఆ తర్వాత ఢిల్లీ చేరుకుని ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలదళం.. ఎన్నికల…
ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనుండగా.. 13,638 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 68 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 68 పింక్ స్టేషన్లు ఉన్నాయి.
Hair Transplant : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎంతపని చేసింది.. బట్టతల పోతుందని ఆపరేషన్ చేయించుకుంటే ఆ యువకుడి ప్రాణాలనే తీసింది. ఇటీవల కాలంలో బట్టతల అనేది పురుషుల్లో ప్రధాన సమస్యగా మారింది.
Anti-Brahmin slogans on walls of JNU spark controversy: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ మరో వివాదానికి కేంద్రం అయింది. యూనివర్సిటీ క్యాంపస్ లో బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు చేయడంతో మరోసారి వివాదం చెలరేగింది. లాంగ్వేజ్, లిటరేచర్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల గోడలపై బ్రహ్మణ వ్యతిరేక నినాదాలు దర్శనిమచ్చాయి. ఇది వామపక్ష-బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీల మధ్య మరోసారి ఉద్రక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీనికి లెఫ్ట్ విద్యార్థి సంఘాలే కారణం అని బీజేపీ ఆరోపిస్తోంది.…
ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త టీమ్‌ను ప్రకటించింది ఏఐసీసీ.. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. అయితే, ఇవాళ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిశారు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు.. ఏపీలో పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియాతో మాట్లాడిన గిడుగు రుద్రరాజు.. మాది యంగ్ టీమ్.. పార్టీ బలోపేతం…