ఓ డ్రైవర్ కారును అతి వేగంగా నడిపాడు. కారు అదుపుతప్పి ఓ ముగ్గురు పిల్లలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బాగ్‌లోని లీలావతి స్కూల్ సమీపంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది.
నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న జరగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు వచ్చే వారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చేరనున్నారు. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం సూపర్ స్టార్‌ను యాత్రలో పాల్గొనమని రాహుల్ గాంధీ ఆహ్వానించారు.
Delhi man throws 2-year-old son off building after tiff with wife: భర్యాభర్తల గొడవ కన్న కొడుకు ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. భార్యతో గొడవ పడిన వ్యక్తి రెండేళ్ల కొడుకును బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసిసే.. తాను కూడా అక్కడ నుంచి దూకాడు. వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం ఢిల్లీలోి కల్కాజీ ప్రాంతంలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న…
తన జీవిత భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను గొంతు కోసి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ అమీన్ పూనావాలా బెయిల్ కోరుతూ శుక్రవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అతని న్యాయవాది వెల్లడించారు.
Twitter: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తర్వాత కంపెనీలో పలు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు చివరిలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి ట్విట్టర్ ఉద్యోగుల జీవితాలు చాలా కష్టతరంగా తయారయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ శకం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు అధినేత కేసీఆర్ హస్తినలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీయాగం, యాగ పూర్ణాహుతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. వేదపండితుల ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి.. తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ…
దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఇవాళ ఉదయం 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పోలీసులు కేసును ఛేదించినట్లు ద్వారక డీసీపీ ఎం.హర్షవర్ధన్ బుధవారం తెలిపారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సర్వర్లపై సైబర్ దాడికి పాల్పడింది చైనా హ్యాకర్లేనని ప్రభుత్వ వర్గాలు ఈ రోజు తెలిపాయి. ప్రస్తుతం అందులోని డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిపాయి. ఈ సైబర్ దాడి చైనా హ్యాకర్ల పనే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం పాటుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.