Flying Buses: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెట్రో సిటీల్లో ఎలివేటెడ్ ఎయిర్‌పాడ్ ఆధారిత వ్యవస్థలు, ఫ్లాష్-చార్జింగ్ ఎలక్ట్రిక్ బస్సులు లాంటి కొత్త రవాణా పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది.
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైంది. అలాగే జూన్ మాసం కూడా సగం రోజులైపోతుంది. కానీ ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో దౌత్య బృందాలు విజయం సాధించాయని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు అధికార-ప్రతిపక్షాలతో కూడిన ఏడు బృందాలను ఆయా దేశాలకు కేంద్రం పంపించింది.
రెండు రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ కూర్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. రెండు గంటలకు పైగా చర్చ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పైనా విస్తృతమైన చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి…
దేశ రాజధాని ఢిల్లీని నిన్నామొన్నటి దాకా దుమ్ము తుఫాన్ హడలెత్తించింది. ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్నటి నుంచి వేడి గాలులు తీవ్రమయ్యాయి. భానుడు భగభగ మండిపోతున్నాడు
Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్మెంట్లో ఈ రోజు (జూన్ 10న) ఉదయం 10 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Crime News: ఢిల్లీలో దారుణం జరిగింది. 09 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, రక్తస్త్రావం అవతున్న స్థితిలో ఆమెను సూట్‌కేస్‌లో కుక్కి చంపినట్లు ఆదివారం పోలీస్ అధికారులు తెలిపారు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత, కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. కొన్ని గంటల తర్వాత, శనివారం సాయంత్రం నెహ్రూ విహార్‌లోని ఫ్లాట్‌లోని రెండో అంతస్తులో సూట్‌కేస్ కనిపించింది. ఇందులో బాలిక అపస్మారస్థితిలో కనిపించింది.
CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు గురువారం రాత్రి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్లో రేఖ గుప్తాను చంపేస్తామని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. పట్టపగలే మనుషులపైకి తెగబడింది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఒక వ్యక్తిపైకి అమాంతంగా దాడి చేసి ఈడ్చుకుపోయింది. దీంతో దానితో పోరాడలేక కిందపడిపోయాడు. అనంతరం దాడి చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.