సింధు జలాలు ఏకపక్షంగా నిలిపివేసే అధికారం భారత్‌కు లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్య ఢిల్లీ దుష్ట కుట్రగా అభివర్ణించారు. మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. కానీ యువకుడు మాత్రం కామంతో కళ్లు నెత్తికెక్కాయి. ప్రేమించాలని వెంటపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. బిల్డింగ్ పైనుంచి తోసేయడంతో యువతి మరణించింది. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు.
ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఓ ప్రజాప్రతినిధి గూండాయిజం ప్రదర్శించాడు. సాటి ప్రయాణికుడి పట్ల సహృదయంతో ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే రౌడీయిజం చూపించాడు.
భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (జూన్ 19న) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు లాంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్‌కు సీఎం తెలియజేశారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఓటర్ ఐడీ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఓటర్ గుర్తింపు కార్డులు 15 రోజుల్లో అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త కార్డు లేదా అప్డేట్ కార్డులను 15 రోజుల్లోనే ఇవ్వాలని సూచించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమైన లోకేష్.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు.
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కలిసిన మంత్రి నారా లోకేష్.. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున…