దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని జంగ్‌పురా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump Tariff: ట్రంప్ మొండివైఖరి.. భారత్‌తో చర్చలకు..!
ఢిల్లీలోని నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగ్పురాలోని భోగల్ మార్కెట్ లేన్‌లో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పార్కింగ్ విషయంలో ఘర్షణ మొదలైంది. గేటు ఎదురుగా ఉన్న స్కూటర్‌ను తీసేయాలని ఆసిఫ్ పొరుగింటి వారికి చెప్పాడు. ఇది ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారిసింది. పొరుగింటి వ్యక్తి పదునైన ఆయుధంతో ఆసిఫ్‌పై దాడి చేయగా ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Bollywood : స్టార్ హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టి రూ. 500 కోట్లు కొల్లగొట్టిన చిన్న సినిమా..
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో కూడా ఆసిఫ్‌తో గొడవ పడినట్లుగా తెలిపారు.
ఆసిఫ్.. బాలీవుడ్ నటి హుమా ఖురేషికి బంధువు. అలాగే ఆసిఫ్ తండ్రి కూడా సనీ పరిశ్రమలో ఉన్నట్లు తెలుస్తోంది. అలా రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. ఇక హుమా ఖురేషి.. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, బద్లాపూర్, మోనికా, ఓ మై డార్లింగ్ చిత్రాలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. సాకిబ్ 83, రేస్ 3, బార్డ్ ఆఫ్ బ్లడ్, ఇతర చిత్రాల్లోని పాత్రలకు కూడా గుర్తింపు వచ్చింది.