లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఇండియా కూటమి నేతలకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఆగస్టు 7న విపక్ష సభ్యులకు డిన్నర్ పార్టీ ఇస్తున్నారు. బీహార్‌లో చేపట్టిన ఎన్నికల సర్వేపై ప్రతిపక్ష పార్టీలు.. ఈనెల 8న ఎన్నికల సంఘానికి నిరసన తెల్పాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఒకరోజు ముందుగానే విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు రాహుల్‌గాంధీ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరగనుంది. ప్రతిపక్షం నుంచి కూడా అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా చర్చ జరగనుంది.
ఇది కూడా చదవండి: Domestic Violence: శాడిస్ట్ భర్త చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య.. కలకలం రేపుతోన్న నవ వధువు లెటర్!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి విపక్ష పార్టీలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాపై ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల బీహార్ ఓటర్ జాబితాను విడుదల చేసింది. 65 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలిపింది. ఇక కొత్త ఓట్ల నమోదుకు సమయం ఇచ్చింది. సెప్టెంబర్ నెలాఖరుకు తుది జాబితా విడుదల చేయనున్నట్లు చెప్పింది. అయితే అధికార పార్టీకి మద్దతుగా ఈసీ ఓట్లను తొలగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి ఏర్పడింది. ఇక ఓటమి తర్వాత ఒక్కసారి కూడా కలవలేదు. ఈనెల 7న రాహుల్ గాంధీ ఇచ్చే విందులో తిరిగి నేతలంతా కలవనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ విందుకు ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హాజరుకానున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరవుతున్నట్లు చెప్పింది. కానీ ఏ నాయకుడు హాజరవుతారో మాత్రం చెప్పలేదు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఇంకా ఆరోగ్య సమస్య నుంచి కోలుకోలేదు. ఆయన ఆరోగ్యం కుదిటపడితే హాజరవుతారు. ఇక శివసేన (యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ), జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇతర భారత కూటమి నేతలంతా ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సంవత్సరం బీహార్, వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుతో సహా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రికి తప్పిన విమానం ప్రమాదం.. పైలట్ ఏం చేశాడంటే..!