దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవలే యజమాని భార్యను, కొడుకును పని మనిషి ఘోరంగా చంపేశాడు. కేవలం తిట్టారన్న కోపంతో నిందితుడు ఈ ఘతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను మరువక ముందే తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. మహిళ, ఆరు నెలల శిశువు దారుణ హత్యకు గురయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతగా కురిసిన వానకు నగరం అతలాకుతలం అయింది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్ని ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు జరగనున్నాయి. కేశవ్ కుంజ్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో మంతన్ బైటక్ జరగనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తిట్టారన్న కోపంతో ఇంటి యజమానురాలిని, ఆమె చిన్న కుమారుడిని అత్యంత దారుణంగా పని మనిషి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
సింధు జలాలు ఏకపక్షంగా నిలిపివేసే అధికారం భారత్‌కు లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్య ఢిల్లీ దుష్ట కుట్రగా అభివర్ణించారు. మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. కానీ యువకుడు మాత్రం కామంతో కళ్లు నెత్తికెక్కాయి. ప్రేమించాలని వెంటపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. బిల్డింగ్ పైనుంచి తోసేయడంతో యువతి మరణించింది. పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను మీనా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు.
ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన ఓ ప్రజాప్రతినిధి గూండాయిజం ప్రదర్శించాడు. సాటి ప్రయాణికుడి పట్ల సహృదయంతో ఉండాల్సిన ఓ ఎమ్మెల్యే రౌడీయిజం చూపించాడు.