డిల్లీ – దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నారు.. విజ్ఞాన భవన్లో జరిగే సదస్సులో దేశంలోని పలు కీలక అంశాలపై చర్చించనున్నారు..
కాంగ్రెస్ న్యాయ సదస్సును మొత్తం ఐదు సెషన్లుగా విభజించారు
1. సామాజిక న్యాయం & రాజ్యాంగం: సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు
2. మతం & రాజ్యాంగం: నియంత్రణలు, మార్గదర్శకాలు
3. అధికార విభజన, ప్రజాస్వామ్య బాధ్యత: సమాఖ్య వ్యవస్థ దిశ?
4. న్యాయ స్వతంత్రత & రాజ్యాంగ సంస్థల అశక్తతపై చర్చ
5. వాలెడిక్టరీ సెషన్: “రాజ్యాంగ దిక్సూచి: ప్రజాస్వామ్య భారత పట్ల కాంగ్రెస్ నిబంధిత విధేయత”
ఇలా న్యాయపరమైనటువంటి అంశాలపై జరిగే చర్చలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు ప్రసంగిస్తారు.. అంతేకాదు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎజెండా అంశాలపై ప్రసంగిస్తారు.. సదస్సులో మొత్తం 41 మంది ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సమావేశంలో మాజీ న్యాయమూర్తులు, న్యాయవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు పాల్గొననున్నారు..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే, ఏ సదస్సు భారత ప్రజాస్వామ్య యాత్రలో ఒక కీలక ఘట్టమని, దేశ ప్రజాస్వామ్య పునాది విలువలకు మళ్లీ కట్టుబడి నిలబడాల్సిన సమయమని చెప్తున్నారు రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ లీగల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అభిషేక్ మను సింగ్బి.. అయితే శనివారం ఢిల్లీలో జరిగే సదస్సు పార్టీ సభ కాకుండా, దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు అవసరమైన చర్చలకు అవకాశం కల్పించే బహుముఖ వేదిక అని సింగ్వి తెలిపారు..